ICDS | కోరుట్ల, మే 1: తల్లిదండ్రులు తమ కూతుళ్లపై వివక్ష చూపకుండా కుటుంబంలో సమ ప్రాధాన్యం కల్పించాలని సీడీపీవో మణెమ్మ, మహిళ సాధికారత కేంద్రం ప్రతినిధులు గౌతమి, స్వప్న అన్నారు. పట్టణంలోని అంగన్వాడీ అర్బన్ సెక్టార్లో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళ సాధికారతపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు.
బాలికలను బాలురతో సమానంగా పోషించాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లల ఆరోగ్యం, చదువుపై శ్రద్ద వహించి తమ పిల్లలు క్రమశిక్షణతో ఎదిగే విధంగా చూడాలన్నారు. బాల్య వివాహాలను అడ్డుకోవాలని, బాల్య వివాహం చేయడం ద్వారా బాలిక తన హక్కులను కోల్పోతుందన్నారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా మిషన్ శక్తి, మహిళా సాధికారత, సఖి కేంద్రం 181, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, సఖి కేంద్రం 181, సైబర్ క్రైం 1930, వయోవృద్ధుల హెల్ప్ లైన్ 14567, వివిధ రకాల సేవల అవశ్యకతపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంగన్వాడీ సూపర్వైజర్ భారతి, చైల్డ్ హెల్ప్ లైన్ కౌన్సిలర్ అనురాధ, మానస, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.