ఫర్టిలైజర్సిటీ, జూలై 31: గోదావరిఖని ప్రభుత్వ మెడికల్ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న 85 పడకల ప్రభుత్వ దవాఖానలో అంధకారం అలుముకున్నది. బుధ వారం తెల్లవారుజామున 2గంటల నుంచి సాయం త్రం 4 గంటల వరకు కారు చీకట్లో మగ్గింది. ఐసీయూ, సాధారణ ఓపీ, ఎమర్జెన్సీ మెడికల్ విభాగం, జనరల్ ఐపీ గదులకు విద్యుత్ సరఫరా లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డయాలసిస్ పెషేంట్లకు డయలాసిస్ జరుగలేదు.
పవర్ కట్తో వాష్రూంలో నీటి వసతి లేక జనరల్ ఐపీ విభాగంలో జ్వరం, ఇతర సాధారణ సమస్యలతో వచ్చిన రోగులు, వారి బంధువులు దవాఖాన బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. బుధవారం ఉదయం దాదాపు 535 మంది దవాఖానకు రాగా, అందులో 36మంది ఇన్పెషేంట్లుగా చేరారు.
అయితే దవాఖానకు కరెంట్ కోసం భూమి లోపల నుంచి వేసిన విద్యుత్ కేబుల్ భారీ వాహనాల రాకపోకలతో షాట్ సర్క్యూట్ జరిగి తెగిపోవడం వల్లే సరఫరా నిలిచిపోయినట్లు సిబ్బంది గుర్తించారు. సాయంత్రం 4 గంటలకు సరఫరాను పున రుద్ధరించారు. మెయిన్ కేబుల్వైర్ తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, యుద్ధ ప్రతిపాదికన మర మ్మతులు చేసి కరెంటును పునరుద్ధరించామని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందుసింగ్ చెప్పారు.
రాత్రి జాగారం చేసిన
రక్తకణాల సంఖ్య తగ్గడంతో రెండ్రోజుల కింద దవాఖానకు వచ్చిన. రాత్రి నుంచి కరెంటు లేకపోవడంతో జాగారం చేయాల్సి వచ్చింది. తనతో పాటు మా కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడ్డరు.
– దాంపెల్లి భాగ్య, జూలపల్లి