Dari Maisamma | ఓదెల, జూలై 3 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో దారి మైసమ్మ ఉత్సవాలను ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆటో యజమానులందరూ దారి మైసమ్మ ఆలయం వరకు ఆటోలతో ర్యాలీగా వెళ్లి అక్కడ మైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రోడ్డుపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చల్లంగా చూడాలని వేడుకున్నారు. పొత్కపల్లి నుండి సుల్తానాబాద్ కు వెళ్లే దారి, పొత్కపల్లి టూ కాల్వ శ్రీరాంపూర్ వెళ్లే దారి, గుంపుల-రూపు నారాయణపేట దారులలో ఘనంగా దారి మైసమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మారుతీ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రంగు ఆనంద్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ శివరాజ్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మోయిన్, క్యాషర్ అన్నం సతీష్, సంయుక్త కార్యదర్శి యాకూబ్ పాషా, ప్రచార కార్యదర్శి యూసుఫ్, మారుతి ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.