దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలి
సర్కారు అమలు చేస్తున్న దళితబంధును సద్వినియోగం చేసుకొని దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పిలుపునిచ్చారు. మేలైన యూనిట్లను ఎంపికచేసుకొని వ్యాపారాల్లో రాణించాలని సూచించారు. బుధవారం మెట్‌పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో
ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
లబ్ధిదారుకు యూనిట్ పంపిణీ
మెట్పల్లి, మే25 : సర్కారు అమలు చేస్తున్న దళితబంధును సద్వినియోగం చేసుకొని దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పిలుపునిచ్చారు. మేలైన యూనిట్లను ఎంపికచేసుకొని వ్యాపారాల్లో రాణించాలని సూచించారు. బుధవారం మెట్‌పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో దళిత బంధు కింద మెట్పల్లి మండలం సత్తెక్కపల్లికి చెందిన చెప్యాల నర్సయ్యకు మంజూరైన ట్రాక్టర్‌ను ప్రారంభించి తాళపుచెవిని అందజేశారు. ట్రాక్టర్‌ను చక్కగా నడిపించుకుని ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ఎదగాలని ఎమ్మెల్యే సూచించారు. దశల వారీగా అర్హులందరికీ దళిత బంధు పథకం కింద యూనిట్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఉపాధ్యక్షుడు పూదరి సుధాకర్‌గౌడ్, వైస్‌ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, నాయకులు రాజాగౌడ్, డా.సత్యనారాయణ, ఒజ్జెల బుచ్చిరెడ్డి, జావిద్ పాల్గొన్నారు.
సామాజిక సేవే కాదు కష్టాల్లో ఉన్న పేద కుటుంబాల్లోని యువతుల వి వాహాలకు అండగా నిలుస్తున్నారు ‘ఆసరా ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు, సా మాజిక సేవకుడు పెంట రాజేశ్-సుగుణ దంపతులు. బుధవారం ఉదయం 10 గంటలకు పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య ఎనిమిది జంటలకు ఒకేసారి సామూహిక వివాహ వేడుకను అంగరంగ వైభవంగా జరిపించారు. వధూవరులకు నూతన వస్ర్తాలు, పుస్తె మట్టెలు పెట్టి, ఆడబిడ్డల తరపున వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. ఈ సందర్భంగా పెంట రాజేశ్ మాట్లాడుతూ నిరుపేదలకు సాయం చేయాలనే సంకల్పంతో ఆరేళ్ల కిందట ఆసరా ఫౌండేషన్‌ను స్థాపించి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 101 జంటలకు సామూహిక వివాహాలు జరిపించామని పేర్కొన్నారు. ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెళ్లిళ్లు చేసుకున్న జంటలు కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకుని లబ్ధిపొందాలని సూచించారు. సేవా కార్యక్రమాల్లో తనకు సహాయ సహకారాలు అందిస్తున్న బంధుమిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో పేద ప్రజలకు మరిన్ని సేవలందిస్తానని పేర్కొన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. గరీబోళ్ల పెళ్లిలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్న సామాజిక సేవకుడు పెంట రాజేశ్-సుగుణ దంపతులను అభినందించారు. అనంతరం నూతన వధూవరులతో రాజేశ్ దంపతులు సహపంక్తి భోజనం చేశారు. కల్యాణ వేడుక సందర్భంగా సుమారు 4వేల మందికి విందు ఇచ్చారు. అప్పగింతల కార్యక్రమంలో భాగంగా పెండ్లి కూతుళ్లను అత్తగారింటికి సాగనంపారు. వేద పండితులు కొండపాక శ్రీనివాసచార్యులు ఆధ్వర్యంలో అర్చకుడు సామూహిక వివాహ మహోత్సవాన్ని విజయవంతం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

