Dalit Ratna Award | కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్ 16 : అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సభలో కాల్వశ్రీరాంపూర్ గ్రామ వాసి, మాస్టి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దంతనపెల్లి చిన్న స్వామి దళితరత్న అవార్డు అందుకున్నారు. మాస్టి సామాజిక వర్గానికి చేస్తున్న సేవలను గుర్తించి, తనకు ఈ అవార్డు ఇచ్చినట్లు స్వామి తెలిపారు. మారుమూల మండలానికి చెందిన నన్ను ఈ ఆవార్డుకు ఎంపిక చేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు.
మహానీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ డాక్టర్ మహేందర్, దొమ్మటి సుదర్శన్బాబు, వైస్ ప్రెసిడెంట్ భైరి వెంకటేశ్, అంబేద్కర్ సంఘం నాయకులకు, మాస్టి సంఘం కులస్థులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా కాల్వశ్రీరాంపూర్ లో అవార్డు గ్రహీత స్వామిని పలువురు అభినందించి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జూపాక ఉమామహేశ్వర్, పాల రాజేశం, తాండ్ర రాజేశ్, ఇటుకల భిక్షపతి, దర్శనం వెంకటయ్య, నర్సింహా, దంతనపెల్లి ధర్మయ్య, గోపి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.