ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. వాడవాడలా మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. ఉదయం నుంచే విద్యార్థుల ర్యాలీలు, ప్రదర్శనలు, జయజయ నినాదాలతో సంబురాలు హోరెత్తాయి..

కరీంనగర్, జగిత్యాల పోలీస్ పరేడ్ మైదానాలు, పెద్దపల్లి కలెక్టరేట్లో కలెక్టర్లు పమేలా సత్పతి, సత్యప్రసాద్, కోయ శ్రీహర్ష, రాజన్న సిరిసిల్ల పరేడ్ మైదానంలో ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

పతాకాకావిష్కరించిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల్లో సేవలందించిన అధికారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి, పథకాలు పంపిణీ చేశారు.

స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. ఆయా చోట్ల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.