కార్పొరేషన్, ఆగస్టు 9: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సొంతిల్లు ఉండాలనదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇప్పటికే చాలామంది నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చామన్నారు. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని, సొంత స్థలం ఉన్నవారికి ఈ పథకం కింద 3 లక్షలు అందిస్తామని చెప్పారు. రేషన్ కార్డు ఉన్న ప్ర తిఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ పా డి కౌశిక్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితల సతీశ్‌కుమార్, సుంకె రవిశంకర్, ఉన్నతాధికారులతో కలిసి గృహలక్ష్మి, దళితబంధు, బీసీ కులవృత్తులకు చేయూత, సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. యుద్ధప్రాతిపాదికన లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాలను అందించాలని సూచించారు. అనంతరం మాట్లాడుతూ, స్లాబ్ ఇల్లు ఉన్నవారు, జీవో 59 కింద లబ్ధిపొందిన వారు ఈ పథకానికి అనర్హులన్నారు. గృహలక్ష్మి కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారం ఏదీ లేదని, సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫారంతో సర్కారుకు సంబం ధం లేదన్నారు.
తెల్లకాగితంపై రాత పూర్వకంగా ద రఖాస్తు రాసి, ఆహార భద్రత, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీకార్డుతో జత చేసి గ్రామాల్లో తహసీల్దార్, పట్టణాల్లో మున్సిపాలిటీల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పాత ఇల్లు గానీ, స్థలాలకు గానీ దస్తావేజు పేపర్లు లేకపోయిన, ఇంటి నంబర్ ఉన్నా, ఖాళీ స్థలం ఉన్న కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జిల్లాకు చెందిన మంత్రి, కలెక్టర్ నేతృత్వంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ఈ స్కీం పర్యవేక్షణకు ప్రభుత్వం నియోజకవర్గానికి నోడల్ ఆఫీసర్, ప్రతి మండలానికి స్పెషల్ విచారణాధికారిని నియమించిందన్నారు. 3 లక్షలను మూడు విడుతల్లో అనగా బెస్మెంట్ పూర్తికాగానే మొదటి విడుత లక్ష, రూఫ్ పూర్తి కాగానే మరో లక్ష నిర్మాణం పూర్తయిన తర్వాత లక్ష అందిస్తామన్నారు. లబ్ధిదారులు తమకు నచ్చినట్లుగా ఇండ్లు నిర్మించుకోవచ్చన్నారు. రేపటిలోగా దరఖాస్తులు స్వీకరించి 20వ తేదీలోగా దరఖాస్తుదారుల విచారణ పూర్తి చేస్తామన్నారు. 25న మొదటి విడత లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు. లబ్ధిదారుల్లో ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 10 , బీసీలు 50 , వికలాంగులు 5 శాతం మించకుండా ఉండేలా చూ డా లని అధికారులకు సూచించారు. గృహలక్ష్మి పథకం మహిళ పేరిట వర్తింపజేస్తామన్నారు. స్థలం మాత్రం మహిళ పేరిట ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఈ పథకం కోసం మహిళ పేరిట నూతన బ్యాంకు ఖా తా తీయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గృహల క్ష్మి కింద మొదటి విడతగా జిల్లా వ్యాప్తంగా 10, 500 ఇండ్లు మంజూరయ్యాయని, ఇందులో కరీంనగర్ నియోజకవర్గానికి 3 వేలు, చొప్పదండికి 1650, మనకొండూర్కు 2వేలు, హుజూరాబాద్ నియోజకవర్గానికి 2600, హుస్నాబాద్ నియోజకవర్గంలోని కరీంనగర్ జిల్లా పరిధిలో మండలాలకు 1250 మంది లబ్ధిదారులకు అందిస్తామన్నారు.
15లోగా వృత్తిదారులకు చెక్కులు
బీసీ కులవృత్తుల చేయూత పథకం చెకుల ఈ నెల 15లోగా పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి కమలాకర్ ఆదేశించారు. మైనార్టీబంధు విధివిధానాలు త్వరితగతిన ఖరారు చేసి మరో రెండు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. రెండోవిడుత దళితబంధు కింద నియోజకవర్గానికి 11 వందల యూనిట్లను మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. మొదటి విడుతలో పెండింగ్‌లో ఉన్న యూనిట్లను పూర్తిస్థాయి గ్రౌండింగ్ చేసేందుకు అధికారులు యుద్దప్రతిపాదికన చర్యలు చేపట్టాలన్నారు. గొర్రెల పథకం మొదటి విడుతలో మం జూ రైన వారికి యూనిట్లు త్వరగా అందించాలని సూ చించారు.. రెండో విడుత జిల్లాకు 10,236 యూనిట్లను కేటాయించారని దీనికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కరీంనగర్ జిల్లాకు 540 మంది వీఆర్ఏలను కేటాయించారని తెలిపారు. వీరిని ఆయా శాఖాల్లో నియమిస్తూ గురువారం నుంచి ఆర్డర్లు జారీ చేస్తామన్నా రు. వీఆర్‌ఎల్‌లో 60 ఏళ్ల లోపు 439 మంది ఉంటే, 60 ఏళ్లు దాటిన వారు 107 మంది ఉన్నారని, 61 ఏళ్లు ఉన్న వారి కుటుంబ సభ్యుల విద్యార్హతను బట్టి ఉద్యోగ నియమాకాలు చేపడుతామన్నారు.
15న కేబుల్ బ్రిడ్జిపై సాంస్కృతిక కార్యక్రమాలు
కరీంనగర్ మానేరుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిపై ఈనెల ఆగస్టు 15 స్వతంత్య్ర దినోత్స వం సందర్భంగా సాయంత్రం సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ప్రతి శని, ఆదివారాల్లో సాయంత్రాలు కేబుల్ బ్రిడ్జిపైకి వాహనాల రాకపోకలను నిలిపివేసి సండే ఫండే పేరుతో ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే విధంగా వివిధ కార్యాక్రమాలు చేపడుతామన్నారు. ఇక్కడ పుడ్ స్టాల్స్, పిల్లలు ఆడుకునే కార్యక్రమాలు, షాపింగ్ సదుపాయాలు, క్రాకర్ షో, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దీనికి సంబంధించి నము నా చిత్రాలను మంత్రి పరిశీలించారు. బ్రిడ్జిపై ఏయే ప్రాంతాల్లో వేటిని ఏర్పాటు చేయాలన్న విషయాలపై అధికారులకు సూచలను చేశారు. దీనికి కోసం వెంటనే చర్యలు తీసుకొవాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ బీ.గోపి, మేయర్ యాదగిరి సునీల్‌రావు, న్యాఫ్స్‌కాబ్ చైర్మన్ కొడూరి రవీందర్‌రా వు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌గౌడ్, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఏఎంసీ చైర్మన్ రెడ్డవేణి మధు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు పాల్గొన్నారు.