Rain | మానకొండూర్ రూరల్, జులై 23: గత రెండు రోజులుగా వర్షాలతో ఊళ్లల్లోని చెరువులు, కుంటలు మత్తళ్లు పడేందుకు సిద్ధంగా ఉన్నాయి. మానకొండూర్ మండలం మద్దికుంట చెరువు నిండి మత్తడి పడుతుంది. ఈ వరదలకు వేసిన వరి పంటలు నీట మునిగాయి. మొన్నటి వరకు నీళ్లు లేక నానా కష్టాలు పడి, వేల రూపాయలు పెట్టి నాట్లు వేసుకొని మందులను సైతం వేసినట్లు రైతన్నలు దిగులు పడుతున్నారు.
ఓ పక్క వానలు పడక బాధపడాలా, వానలు పడ్డాయని సంతోషం వ్యక్తం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. చెరువు మత్తళ్లలో, వరదలో మత్స్యకారులు చేపలను పట్టుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.