MLA Koonanmeni | చిగురుమామిడి, జూన్ 13: మండలంలోని రేకొండ గ్రామంలో మాజీ ఎంపీపీ స్వర్గీయ చాడ ప్రభాకర్ రెడ్డి సతీమణి మాజీ ఎంపీటీసీ చాడ శోభ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శుక్రవారం సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి తో కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
వారి కుమారులు చాడ శ్రీధర్ రెడ్డి, మురళీధర్ రెడ్డిలకు పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారు ఎంపిటిసిగా చేసిన సేవలను కొనియాడారు. అనంతరం చాడ శోభ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొన్నగంటి కేదారి, మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు అందే స్వామి, గూడెం లక్ష్మి, జిల్లా కౌన్సిల్ సభ్యులు బూడిద సదాశివ, బోయిని సర్దార్ వల్లభాయ్ పటేల్, కాంతాల శ్రీనివాస్ రెడ్డి,తేరాల సత్యనారాయణ, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, మండల నాయకులు మండల కొమురయ్య, నీల వెంకన్న, మొగిలి ఓదెలు, విలాసాగరం అంజయ్య, సమ్మయ్య తదితరులున్నారు.