కార్పొరేషన్ మార్చ్ 18 : కరీంనగర్ జిల్లా కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా స్థానిక సాలే నగర్ వద్ద ఈద్గా మైదానంలో బుధవారం పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయి పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
సీలింగ్ లైటింగ్ సౌండ్ సిస్టమ్, వాహనాలు పార్కింగ్ తదితర అంశాల పైనా ఉన్నత అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పోరేటర్లు సుధగుని మాధవి, పర్వతం మల్లేశం, వరాల నర్సింగం, వైద్యుల అంజన్ కుమార్, ఏసీపీ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.