CP Ghaus Alam | చిగురుమామిడి, జూన్ 5 : కియో జాతీయస్థాయి కరాటే పోటీలకు 12 సంవత్సరాల విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుండి కరీంనగర్ జిల్లా జపాన్ కరెక్ట్ అసోసియేషన్ ఇండియన్ చోటో కాన్ కరాటే ఇన్స్టిట్యూట్ కు చెందిన ఎస్. సాయినితిన్ రెడ్డి ఎంపిక అయ్యాడు. ఈనెల 12 నుండి 15వ తేదీ వరకు డెహ్రాడూన్ లో నిర్వహించే కియో జాతీయ స్థాయి కరెక్టే పోటీలలో పాల్గొననున్నాడు.
ఈ పోటీలకు ఎంపికైన విద్యార్థినిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అభినందించి శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో షో టోకాన్ కరాటే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, జిల్లా కియో జనరల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బుల్లి ఐలయ్య, జిల్లా ట్రెజరర్ బండారి పల్లి రమేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి నాయకపు రవితేజలు పాల్గొన్నారు.