Godavarikhani | రేషన్ దందా పై దాగుడు మూతల విచారణ.. బియ్యం తూకంలో తరుగుపై సివిల్ సప్లయ్ ఎంక్వయిరీ
రామగుండం నగర పాలక సంస్థ 41వ డివిజన్ జవహర్ నగర్ లో గల ఓ రేషన్ దుకాణంలో బియ్యం తూకంలో తరుగు తీస్తున్నారన్న ఆరోపణలపై గురువారం సివిల్ సప్లయ్ అధికారులు విచారణ దాగుడుమూతలు విధంగా సాగింది.
- గల్లీలో మధ్యవర్తుల మంతనాలు.. విచారణ నీరుగార్చే ప్రయత్నాలు
Godavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 9 : రామగుండం నగర పాలక సంస్థ 41వ డివిజన్ జవహర్ నగర్ లో గల ఓ రేషన్ దుకాణంలో బియ్యం తూకంలో తరుగు తీస్తున్నారన్న ఆరోపణలపై గురువారం సివిల్ సప్లయ్ అధికారులు విచారణ దాగుడుమూతలు విధంగా సాగింది. మధ్యాహ్నం రేషన్ దుకాణంకు వచ్చిన సివిల్ సప్లయ్ అధికారులు షాపులోని కాంటాను పరిశీలించారు. ఆ తర్వాత లీగల్ మెట్రాలజీకి సమాచారం అందించారు.
అప్పటివరకు సివిల్ సప్లయ్ అధికారులు మాత్రం తామేం చేయలేమంటూ అక్కడే గల్లీలో కలియ తిరగడంతో విచారణను నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందంటూ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో కార్డుదారుడికి తూకంలో 4 కిలోలు తరుగు తీస్తూ మోసం చేస్తున్నాడంటూ స్థానికులు సివిల్ సప్లయ్ అధికారులకు వివరించగా, లీగల్ మెట్రాలజీ అధికారులు వస్తేనే బయట పడుతుందనీ, అప్పటి వరకు ఇక్కడే వేచి ఉంటామని సర్దిచెప్పారు. కొద్దిసేపటికే రేషన్ డీలర్ల సంఘం నాయకులు, మధ్యవర్తులు చౌకధరల దుకాణం వద్దకు చేరుకొని అధికారులతో మంతనాలు సాగించారు. సుమారు 2 గంటల పాటు సాగిన విచారణ గందరగోళంకు దారితీసింది.
అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితిలో స్థానికులు, ఫిర్యాదుదారులు అయోమయంకు గురయ్యారు. పత్రికలో కథనం రావడంతో అప్రమత్తమై కాంటాను సరి చేసి ఉంటారని స్థానికులు ఆరోపించారు. విచారణకు వచ్చిన సివిల్ సప్లయ్ అధికారులు కూడా ఏమి చేయాలో తెలియక ప్రక్కన గల్లీలోకి వెళ్లి ఓ ఇంటి వద్ద సేద తీరడం కనిపించింది. అప్పటికే మధ్యవర్తులతో డీలర్ తరఫున వ్యక్తులు జరిపిన మంతనాలు కొలిక్కివచ్చినట్లు తెలిసింది. మధ్యవర్తుల మంతనాలు ఫలించినట్లు తెలుస్తోంది. దీంతో కలెక్టర్ స్వయంగా విచారణకు ఆదేశించాలని స్థానికులు పట్టుబట్టారు. లీగల్ మెట్రాలజీ సిబ్బంది రాకపోయేసరికి అందరూ ఇంటిదారి పట్టారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

