Ramagundam | కోల్ సిటీ, డిసెంబర్ 4: రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో తమకు భాగస్వామ్యం కల్పించాలని మున్సిపల్ కాంట్రాక్టర్లు విన్నవించారు. ఈమేరకు స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ను మున్సిపల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు కలిసి విన్నవించారు. అలాగే గతంలో చేసిన ఎమ్మెల్యే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ పనులకు సంబంధించి పెండింగ్ ఉన్న బిల్లులను త్వరితగతిన ఇప్పించేలా అధికారులను ఆదేశించాలని కోరారు.
అభివృద్ధి పనుల్లో స్థానికులైన కాంట్రాక్టర్లకే ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ఎం మహేందర్ గౌడ్, కుర్మ శ్రీనివాస్, జీ ప్రతాప రెడ్డి, తిరుపతి, మేరుగు రాజేశం, బీ గంగరాజు, జే విశ్వతేజ, దుర్గప్రసాద్, విక్రమ్, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.