Dava Vasanthasuresh | జగిత్యాల : ఆరు గ్యారంటీలంటూ ఝూఠా మాటలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతసురేష్ ఓటర్లకు పిలపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల పట్టణంలోని ఆరో వార్డులో BRS అభ్యర్థి నీలి ప్రతాప్ కు మద్దతుగా ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ BRS హయాంలో జగిత్యాల పట్టణం 60 సంవత్సరాలలో కాని అభివృద్ధి కేవలం పది సంవత్సరాలలో మాత్రమే జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినా ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని, అధికారం కోసం ఆరు గ్యారెంటీలు, 420 హామీలంటూ ఝూటా మాటలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వనికి బుద్ధి చెప్పాలంటే మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి జగిత్యాల మున్సిపల్ పై గులాబీ జెండా ఎగరవేయాలని కోరారు.