ఇది విశ్రాంతి తీసుకునే సమయం కాదు. కష్టమైనా, ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగాలి. మంథని నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులతో భయానక వాతావరణం ఏర్పడుతున్నది. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? మేనిఫెస్టో చైర్మన్‌గా ఉన్న వ్యక్తి శ్రీధర్‌బాబు వీటికి సమాధానం చెప్పాలి.
మంథని నియోజకవర్గంలో రెండున్నరేళ్లుగా ఎలాంటి కొత్త అభివృద్ధి పనులు జరగలేదు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజాదరణ పొందిన పుట్ట మధూకర్‌కు రూ.900 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ బద్నాం చేశారు. రెండున్నరేళ్లవుతున్నా ఆ ఆస్తులను ఎందుకు బహిరంగ పర్చలేదో సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడం లేదు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గురుకులాలు నాశనమవుతున్నాయి. ఇప్పటికే 107 మంది పిల్లలు చనిపోయారు. కొత్తగా తెస్తున్న ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా సూల్స్ కంటే మన పాత గురుకుల పాఠశాలలే దేశంలోనే అత్యుత్తమమైనవి. మంథని నియోజకవర్గంలో వడ్ల కొనుగోలులో క్వింటాల్‌కు 8 కిలోల చొప్పున కోత విధించడం వల్ల రైతులు భారీగా నష్టపోయారు. ఈ నష్టానికి ఎవరు సమాధానం చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను, అబద్ధాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపైనే ఉంది.
– కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి