Eeda Shankar Reddy | కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్ 24 : కోట్ల ఎకరాల మాగాణికి సాగునీరందించాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రూ.94,413 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో తగిన బుద్ది చెపుతారని ఐడీసీ మాజీ చైర్మన్ ఈద శంకర్రెడ్డి అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారంలో శుక్రవారం ఆయన విలేకరుల సమాశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈద శంకర్రెడ్డి మాట్లాడారుతూ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ను బదనాం చేసేందుకే కాంగ్రెస్ ప్రణాళికలు చేసిందని విమర్శించారు. అసలు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు కాళేశ్వరం నిజ స్వరూపం తెలుసా అంటూ ప్రశ్నించారు.
నీటి పారుదల మంత్రి ఉత్తమ్ మాటలు ఉత్త మాటలే అని విమర్శించారు. రూ.94,413 వేల కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో 9 బ్యారెజీలతో అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ, ఉండగా మేడిగడ్డలో 86 పిల్లర్లు ఉండగా కేవలం రెండు పిల్లర్లు కుంగితే కాంగ్రెస్ ప్రభుత్వం రాద్దాంతం చేయడం తగదని అన్నారు. ఇందులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెపుతున్న మంత్రులకు ఈ ప్రాజెక్టుపై అవగాహన లేక మాట్లాడుతున్నారని విమర్శించారు. సుందిల్ల లో 74 పిల్లర్లు, అన్నారంలో 86పిల్లర్లు ఉన్నాయన్నారు.
21 బాహుబలి పంప్ హౌజ్ లతో రెండు టీఎంసీ ల నీటిని లిప్ట్ చేసే సామర్థ్యంతో 19 సబ్ స్టేషన్లను నిర్మించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు 17రిజర్వాయర్లు ఉండగా అందులో 15పెద్దవి, 2చిన్నవి అన్నారు. 530 మీటర్ల ఎత్తుతో మల్లన్న సాగర్ వరకు ఈ నీరు పోతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు 17రిజర్వాయర్లు ఉండగా అందులో 15 పెద్దవి, రెండు చిన్నవి అన్నారు. 530మీటర్ల ఎత్తుతో మల్లన్న సాగర్ వరకు ఈ నీరు పోతుందని చెప్పారు. భూగర్భం నుండి 203కిలోమీటర్లు, 1531 కి.మీ గ్రావిటీ ద్వారా సాగు నీరందుతుందని అన్నారు. ప్రాజెక్టు కూలిందని ఉత్త మాటలు ఆపి ప్రాజెక్టు నిజస్వరూపం తెలుసుకోవాలంటూ మంత్రి ఉత్తమ్ కు సవాల్ విసిరారు.
తెలంగాణ తొలి సీఎం దూరదృష్టితో ఆలోచించి కాళేశ్వరం నిర్మిస్తే, కాళేశ్వరం ద్వారా ఏమి ప్రయోజనం లేదని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఈద తిప్పికొట్టారు. ప్రాజెక్టు ద్వారా 19లక్షల 63 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతుందని చెప్పారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ప్రాజెక్టు కాళేశ్వం ప్రాజెక్టు అని చెప్పారు. బాధ్యతా రహింతంగా ప్రాజెక్టుపై చేస్తున్న విమర్శలు మానుకోవాలన్నారు. లేకుంటే కాళేశ్వరం శాపంతో కాంగ్రెస్ కాటికి పోవడం ఖాయమని హెచ్చరించారు. ఇరిగేషన్ మంత్రి, ఈ ప్రాంత ఎమ్మెల్యేలు అంతా ఈ ప్రాజెక్టును క్షుణ్ణంగా పరిశీలించడానికి వస్తే నేనే రెండు బస్సులు ఏర్పాటు చేయించి, ప్రాజెక్టుపై పూర్తి అవగాహన కల్పిస్తానన్నారు.
కాళేశ్వరం కూలిందని ఓట్లు దండుకున్న కాంగ్రెస్ నాయకులు విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. పని చేయని కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా నడిపిస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నడవనిదే కొండపోచయ్మ సాగర్ కు నీల్లు ఎక్కడనుండి వచ్చాయని ప్రశ్నించారు. కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే ప్రాజెక్టు నిర్మించి, వినియోగం లోకి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందని అన్నారు. కాంగ్రెస్కు రైతులపై ఏమాత్రం చిత్త శుద్ధి ఉన్నా వెంటనే ప్రాజెక్టు రిపేర్ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తారుపల్లి మాజీ సర్పంచ్ భైరం రమేశ్, బీఆర్ఎస్వీ నాయకుడు పడాల సతీశ్ తదితరులు పాల్గొన్నారు.