వెల్గటూర్, ఆగస్టు 1: ‘కాంగ్రెస్ కాదు స్కాం గ్రెస్. వారి పాలనలో రాష్ట్రంలో చేసింది అంతా అవినీతే. ఒరగబెట్టిందేమీ లేదు. వాళ్లు ఆనాడూ ఏమీ చేయలేక.. ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నది చూడలేక.. ఏదేదో మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ అంటేనే బడా ఝూటా పార్టీ. ఆ పార్టీ నాయకు లు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. నేనొక్కటే చెబుతున్నా వారి మాటలు నమ్మి బొమ్మరిల్లులా ని ర్మించుకన్న రాష్ర్టాన్ని పాడుచేసుకోవద్దు’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు సూచించారు. మంగళవారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో గుల్లకోటకు చెందిన కాంగ్రెస్ నాయకులు 100మంది, చెర్లపల్లికి చెందిన 35మంది బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సింహాచలం జగన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు.
అంతకుముందు పెగడపల్లి మం డలం నంచర్లకు చెందిన వివిధ పార్టీల యూత్ నాయకులు కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈశ్వర్ సమక్షంలో పార్టీలో చేరగా, ఆ యాచోట్ల నాయకులకు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సీ ఎం కేసీఆర్ నాయకత్వంలో 14ఏండ్లు మడమ తిప్పకుండా ఉద్యమం చేసి రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. అబద్ధాలు, అసత్య ప్రచారం చేసే కాంగ్రెస్‌పై ప్రజలు నమ్మకం కోల్పోయారని, నియోజకవర్గంలో పార్టీ ఖాళీ అయిపోయిందని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమని, పార్టీకి రోజు, రోజుకూ ఆదరణ పెరుగుతున్నదని చెప్పా రు.
సీఎం కేసీఆర్ సుపరిపాలనకు అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉందని స్పష్టం చేశారు. పార్టీ లో చేరినవారిలో ధర్మపురి కొమురయ్య, అమరగొండ లచ్చయ్య, మడప బ్రహ్మయ్య, చీకటి శ్రీ నివాస్, గోపాల్‌రెడ్డి, గంగయ్య, ఎండీ నాసర్, గుజ్జేటి భూమయ్య, వెంకటస్వామి, పొన్నం వం శీ, రాజేశం, లక్ష్మన్,భాష్కర్ రామస్వామి, రా జేశం తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఎం పీపీ కునమల్ల లక్ష్మి, ఏఎంసీ చైర్మ న్ పత్తిపాక వెంకటేశ్, ప్యాక్స్ చైర్మన్ గూడ రాం రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పదిరే నారాయణరావు, సర్పంచ్ ల ఫోరం అద్యక్షులు గెల్లు శేఖర్,సర్పంచ్‌లు మా రం జలేందర్‌రెడ్డి, గాగిరెడ్డి లింగ మ్మ రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు ఏలేటి కృష్ణారెడ్డి, పొన్నం తిరుపతి, కునమల్ల లింగయ్య, గుండాటి రాజేశ్వరెడ్డి, గొల్లపల్లి మల్లేశం, పడిదం వెంకటేశ్, సంకోజు తి రుమల్, రెడ్ల కృష్ణ, వనం రమణయ్య, జల్లేల క నుకయ్య, శ్రీనివాస్,గొల్లపల్లి రాజు ఉన్నారు.