వేములవాడ, జూలై 15: రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతున్నదని పదేపదే చెబుతున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడలో మాత్రం కక్షసాధింపు పాలన చేస్తున్నారని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ధ్వజమెత్తారు. అధికారం ఉన్నది కదా అని వేధిస్తే ప్రజలు ఊరుకోరని, కర్రుకాల్చి వాత పెడతారని హెచ్చరించారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభు త్వం వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం నుంచి తిప్పాపూర్ వరకు కూల్చివేసిన దుకా ణాలు, నివాసాలను మంగళవారం నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. దారి వెంట బాధితులతో మా ట్లాడారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
వేములవాడ రహదారి, రెండో వంతెన నిర్మాణానికి జరుగుతున్న విస్తరణలో ఏళ్ల తరబడి వ్యాపారాలతో జీవనోపాధి పొందిన వారి జీవితాలు, దుకాణాలను ఇండ్లను ధ్వం సం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 16న తెల్లవారుజామునే భారీగా పోలీస్ బలగాలతో జేసీబీలను తీసుకువచ్చి కూల్చివేతలు ప్రారంభించారని అన్నారు. అప్పుడు ఒకటీ రెండు రోజులు సమయం ఇవ్వాలని సాక్షాత్తూ ఎమ్మెల్యేను వ్యాపారులు, యజమానులు కోరినా కనీసం గంట కూడా ఇవ్వకుండా కూల్చివేశారని మండిపడ్డారు. ఆగమేఘాల మీద కూల్చిన అధికారులు, నెల రోజులవుతు న్నా భవనాల శిథిలాల నుంచి ఒక తట్ట కూడా ఎత్తలేదని ఆగ్రహించారు. కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా మట్టి దిబ్బలు ఉన్నా పట్టించుకోవడంలేదని అన్నారు.
మట్టిని కూడా తీయకుండా ప్రధాన రహదారిలో వ్యవహరిస్తున్న తీరును చూస్తే ఇది ముమ్మాటికీ కక్షసాధింపు అని అర్థమవుతుందన్నా రు. ఇప్పుడు మూలవాగు వంతెన నిర్మాణం పూర్తికాకుండానే తి ప్పాపూర్ వైపు ఉన్న దుకాణాలను అర్ధరాత్రి జేసీబీలను పంపి ఖాళీ చేయాలని అధికారులు హుకుం జారీ చేయడం ఎంత వరకు కరెక్ట్ అన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? రాజరిక పరిపాలన లో ఉన్నామా..? అని ప్రశ్నించారు. గజానికి 8,500 పరిహారంగా ప్రకటించి నోటీసులు ఇచ్చారని, ఇది డిమాండ్ ఉన్న తిప్పాపూర్ ప్రాంతంలో సమంజసమేనా..? అనేది ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రధాన రహదారి విస్తరణలో దుకాణాలు కోల్పోతున్న వారికి పునరావాసం కల్పిస్తున్నామని ప్రభుత్వం ఇటీవలే హైకోర్టుకు నివేదిక సమర్పించిందని చెప్పారు. 90 శాతానికిపైగా పోయినవారికి దుకాణాల సముదాయం నిర్మించి జీవనోపాధి కల్పిస్తామని ప్రభుత్వం చెప్పిందని, కానీ, ఎమ్మెల్యే నిర్వాసితులకు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, మాజీ జడ్పీటీసీ మ్యాకల రవి, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, వేములవాడ రూరల్ మండలా ధ్యక్షుడు రవి, మాజీ కౌన్సిలర్లు జోగిని శంకర్, సిరిగిరి రామ్‌చందర్, గోలి మహేశ్, ముద్రకోల వెంకటేశం, నాయకులు కొండ కనుకయ్య, నీలం శేఖర్, వాసాల శ్రీనివాస్, శ్రీకాంత్ గౌడ్, గుడి సె సదానందం, వెంకట్ రెడ్డి, కమలాకర్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, చేపూరి రవి, సుంకపాక రాజు, సందీప్ రెడ్డి, హింగే కుమార్, రాకేశ్, శ్రీనివాస్ ఉన్నారు.