Election promises | పెగడపల్లి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిపోయి ప్రజలను తీవ్ర మోసానికి గురి చేసిందని పెగడపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లోక మల్లారెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు మేరకు, ఆదివారం పెగడపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మట్లాడుతూ, ఎన్నికల్లో మోస పూరిత వాగ్దానాలు చేసి, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గట్టి బుద్ధి చెప్పాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోరుకంటి రాజేశ్వర్రావు. గాజుల గంగాధర్, అందె వెంకటేశం, బాలుసాని శ్రీనివాస్, సాయిని రవిందర్, వేరెళ్ల గంగాధర్, ముద్దం మల్లేశం, మడిగెల తిరుపతి, నాగుల రాజశేఖర్ గౌడ్, కాశెట్టి వీరేశం, ఆదినవేని తిరుపతి యాదవ్, రంగు శ్రీనివాస్ గౌడ్, గాలిపెల్లి సత్తయ్య, దావు దేవయ్య, సాయిల్ల ఎల్లయ్య, సాగి సత్యనారాయణరావు, పెంటల శ్రీనివాస్, ఎడ్ల తిరుపతిరెడ్డి, మాల రవి, ఎల్కటూరి రవి, బొల్లవేని మల్లేశం, దొబ్బల వినోద్, సిలివేరు నర్సయ్య, మల్లేశం తదితరులున్నారు.