peddapally | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 19: రైతుల సంక్షేమం కోసం పని చేస్తు సకల వసతులు కల్పిస్తున్నది కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని పెద్దపల్లి, అప్పన్నపేట సింగిల్ విండో పరిధిలోని నిట్టూరు, నిమ్మనపల్లి, తుర్కలమద్దికుంట, కాసులపల్లి, పాలితం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో కలిసి శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు సన్నవడ్లకు భోనస్ , రుణమాఫీ, రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం లాంటి పథకాలతో అనేక సంక్షేమ ఫలాలను అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప సురేందర్, సింగిల్ విండో చైర్మన్ లు మాదిరెడ్డి నర్సింహరెడ్డి చింతపండు సంపత్, సీఈవోలు మెట్టు మదన్ మోహన్, గడ్డి తిరుపతి, మార్కెట్ వైస్ చైర్మన్ కూర మల్లారెడ్డి, మండల వ్యవసాయ అధికారి కాంతాల అలివేణి, మాజీ జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, మండల అధ్యక్షుడు ఏడెల్లి శంకరయ్య , ఎనగందుల ప్రదీప్, నూగిళ్ల మల్లయ్య, ఐకేపి సీఏ అనాసి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.