అన్నదాతపై అదనపు భారం
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది అన్నదాతల పరిస్థితి! ఇప్పటికే ఓ వైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక సాగునీటికి తండ్లాడుతుండగా, ఇటీవలే మరో పిడుగు వేసింది.
- కక్షచూపుతున్న కాంగ్రెస్ సర్కారు
- ఇటీవలే యూరియా, ఎరువుల ఉచిత రవాణా రద్దు
- ధరలు అడ్డగోలుగా పెరిగే ముప్పు
- యూరియాను బ్లాక్ చేసే ప్రమాదం
- ఎల్‌నినో వేళ రైతులకు ఆర్థిక ఇబ్బందులు
- ఉచితంగానే సరఫరా చేయాలని వేడుకోలు
కథలాపూర్, జూలై 26: మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది అన్నదాతల పరిస్థితి! ఇప్పటికే ఓ వైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక సాగునీటికి తండ్లాడుతుండగా, ఇటీవలే మరో పిడుగు వేసింది. వానకాలం సీజన్ వేళ సరిపడా ఎరువులు అందించకుండా గోస పెడుతున్న కాంగ్రెస్ సర్కారు, ఎరువుల ఉచిత రవాణా చార్జీలను ఎత్తివేసింది.
ఇన్నాళ్లూ స్టాక్ పాయింట్ నుంచి ఎరువుల బస్తాల రవాణా చార్జీలన్నీ ప్రైవేట్ వ్యాపారులు భరించగా.. సహకార సంఘాలు, ఆగ్రోస్ కేంద్రాలకు మాత్రం ట్రాన్స్పోర్ట్ చార్జీలను మార్క్‌ఫెడ్ భరించేది. రెండు వారాల క్రితమే ప్రభుత్వం ఉచిత యారియా, ఎరువుల సరఫరాను రద్దు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో యూరియా, ఎరువుల ధరలు పెరిగే ముప్పు పొంచి ఉన్నది.
ఇటు ప్రైవేట్ వ్యాపారులు కూడా అడ్డగోలు ధరలు పెంచడమే కాదు, యూరియాను బ్లాక్ చేసే ప్రమాదమున్నది. ప్రస్తుతం యూరియా బస్తా ధర రూ.266 ఉండగా… రవాణా చార్జీలు ఎత్తివేయడంతో ఒక్కో బస్తాను రూ.310 నుంచి రూ.330 వరకు విక్రయించవచ్చని తెలుస్తున్నది. ఇలానే ఎరువుల ధర పెరగనున్నది. ఒక్క జగిత్యాల జిల్లాలో చూస్తే రూ.1.50 కోట్లకుపైగా భారం పడనున్నది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలోని అన్నదాతలపై దాదాపు రూ.5కోట్లకు పైగా అదనపు భారం పడనుండగా, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఎల్‌నినో ప్రభావంతో పంటలు సాగు ప్రశ్నార్థకంగా మారుతున్నదని, ఇలాంటి సమయంలో రవాణా చార్జీలను ఎత్తివేయడం తమకు మరింత ఆర్థికంగా నష్టం చేస్తుందని మండిపడుతున్నారు. ప్రైవేట్ వ్యాపారుల మాదిరిగానే ఆగ్రోస్, సహకార సంఘాలు ధరలు పెంచి విక్రయించే పరిస్థితులు నెలకొన్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి ఎరువుల రవాణా విషయంలో పాత నిబంధనలు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
భారం మోపడం సరికాదు
సహకార సంఘాలకు సరఫరా చేసే యూరియా బస్తాల రవాణా చార్జీలను సర్కారు ఎత్తేసుడు కరెక్ట్ కాదు. పంటల సాగుకు పెట్టుబడి ఖర్చులు పెరిగినయి. దిగుబడులు సరిగా రాక రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నరు. ప్రస్తుతం రవాణా చార్జీలు ఎత్తివేయడంతో యూరియా ఒక్క బస్తాకు రూ.320 నుంచి రూ.330 చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వం రైతులపై ఆర్థిక భారం వేసే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి.
– కందరి కిషన్‌రెడ్డి, రైతు (సిరికొండ)
ప్రైవేట్ వ్యాపారులను ప్రోత్సహించవద్దు
ఎరువుల ట్రాన్స్పోర్ట్ చార్జీలు ఎత్తేయడం సరికాదు. ప్రైవేట్ వ్యాపారులు అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉన్నది. యూరియా బస్తాలను భారీగా నిల్వ చేసి కృతిమ కొరత సృష్టించే ముప్పు ఉన్నది. రైతులు అధిక ధరలకు యూరియా కొనాల్సిన పరిస్థితులు వస్తయి. ప్రభుత్వం ప్రైవేట్ వ్యాపారులను ప్రోత్సహించే నిర్ణయాన్ని మానుకోవాలి. ప్రభుత్వమే రవాణా చార్జీలతో సహకార సంఘాలకు యూరియా సరఫరా చేయాలి.
– బద్ధం మహేందర్‌రెడ్డి, జిల్లా రైతు ఐక్యవేదిక నాయకుడు
ప్రభుత్వ నిర్ణయం మేరకు విక్రయాలు
సహకార సంఘాలకు యూరియా బస్తాలను ఇన్నాళ్లూ మార్క్‌ఫెడ్ ద్వారా ఉచితంగా రవాణా చేశారు. ఇటీవలే రవాణా చార్జీలను ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో యూరియా బస్తాల రవాణా భారం రైతులే భరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు సహకార సంఘాల ద్వారా యూరియా బస్తాలు విక్రయిస్తాం.
– మనోజ్‌కుమార్, డీసీవో (జగిత్యాల)
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

