KTR Sena | సిరిసిల్ల రూరల్, మే 18: అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఏడాదిన్నర కాలం గడవకముందే అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ అన్నారు. కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్, రామన్న పల్లెలో కేటీఆర్ సేన గ్రామ కమిటీలను ఆయా గ్రామాల్లోని పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఆదివారం ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు.
గత కేసీఆర్ సర్కార్ పాలనలో నిర్మాణ నిండుకుండల ఉండేదని, పంటలకు సాగునీళ్లు అందించారన్నారు. ఇప్పుడు గుడ్ మార్నింగ్ లో నీళ్లు లేవని, రైతులకు పంట పొలాలకు నీరు అందక ఎండిపోయాయని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేయక చతకిల పడ్డదన్నారు. కేటీఆర్ సేనను గ్రామ గ్రామాన తీసుకెళ్లి మరింత బలోపేతం చేస్తామన్నారు. గ్రామాల్లో సీనియర్ నాయకులు పార్టీ నేతలు సహకారంతో కేటీఆర్ సేనను పటిష్టం చేస్తామన్నారు.
రాబోయేది బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యేవరకు విశ్రమించకుండా పనిచేస్తామన్నారు. కేటీఆర్ ఆశయ సాధనాలతో పాటు కేటీఆర్ ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కడికక్కడే అండగడతామన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ సేన గ్రామ కమిటీల నియామకాని సహకరించిన పార్టీ నేతలకు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నూతన గ్రామ కమిటీలకు పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఏస్ సీనియర్ నేతలు కర్నె బాలయ్య, తాటిపాముల శ్రీనివాస్, సత్తు రాంరెడ్డి, పుర్మాని లక్ష్మారెడ్డి, మోతే మహేష్, సత్తు వెంకట రెడ్డి,తిరుపతి, మల్లయ్య, ఆత్మకూరి రంగయ్య యాదవ్, ఆత్మకూరీ శ్రీనివాస్, ఆత్మ కూరి చంటి యాదవ్,శ్రీశైలం, మల్లయ్య, మందా టీ శ్రీనివాస్,సాయిరాం,లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
బస్వాపూర్, రామన్న పల్లె కేటీఆర్ సేన గ్రామ కమిటీలు
బస్వాపూర్ కేటీఆర్ సేన గ్రామ శాఖ అధ్యక్షుడిగా పూర్మనీ ప్రశాంత్ రెడ్డి , ఉపాధ్యక్షుడుగా బాలసాని కమలాకర్ ,జనరల్ సెక్రటరీ గా ఎర్రోళ్ల భరత్ , సెక్రటరీ గా అన్నవేణి బాబు, కర్నె సురేష్, సోషల్ మీడియా ఇన్చార్జి గా బాలసాని ప్రశాంత్ ఎందుకయ్యా రు. అదేవిధంగా రామన్న పల్లె కేటీఆర్ సేన గ్రామ శాఖ అధ్యక్షుడిగా జక్కుల జలంధర్, ఉపాధ్యక్షుడు గా ఆత్మకూరు అనిల్, జనరల్ సెక్రటరీగా కోలాపురి ప్రభాకర్, సోషల్ మీడియా ఇన్చార్జిగా మందాటి తిరుపతి, ప్రధాన సలహాదారులుగా ఆత్మకూరి రమేష్, మేడుదుల శ్రీనివాస్ నియామకమయ్యారు. నూతన గ్రామ కమిటీలకు పార్టీ నేతల చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ప్రత్యేక అభినందన తెలిపారు.