Koppula Eshwar | పెగడపల్లి: రైతులకు యూరియా పంపిణీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో పార్టీ రాష్ట్ర నాయకుడు, పెగడపల్లి విండో చైర్మన్ వోరుగంటి రమణారావు, మండల పార్టీ నాయకులతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన సమవేశంలో మాజీ మంత్రి ఈశ్వర్ మాట్లాడారు.
రాష్ట్రంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పంపిణీ చేయడంలో సీఎం రేవంత్రెడ్డి పూర్తి నిర్లక్ష్యధోరణి అవలంభిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత 10 సంవత్సరాల్లో రైతులు యూరియా కోసం రోడ్డెక్కలేదని, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ రైతులను గాలికి వదిలేసిందని మాజీ మంత్రి ఈశ్వర్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందేలా అందరూ కలిసి కట్టుగా పని చేయలని ఈశ్వర్ వివరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు లోక మల్లారెడ్డి, మండల నాయకులు ఉప్పుగండ్ల నరెందర్రెడ్డి, కోరుకంటి రాజేశ్వర్రావు, సాగి శ్రీనివాసరావు, ఉప్పలంచ లక్ష్మణ్, నాగుల రాజశేఖరౌడ్, సాయిని రవీందర్, వెల్స సత్యనారాయణరెడ్డి, మడిగెల తిరుపతి, భోగ లక్ష్మినారాయణ, కాశెట్టి వీరేశం తదితరులు పాల్గొన్నారు.