ధర్మారం, మే 20: మండలంలో బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై సవాల్ విసిరి, చర్చకు వచ్చిన నాయకులపై కాంగ్రెస్ శ్రేణులు దౌర్జన్యం చేశారు. మూకుమ్మడిగా తరలివచ్చి దాడికి యత్నించారు. మంగళవారం ధర్మారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా జరిగిన ఘటన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయగా, పోలీసులు రంగంలోకి దిగి అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకులను కట్టడి చేశారు. వివరాల్లోకి వెళితే.. ధర్మారం మండలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్ నా యకులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు చర్చకు రావాలని ఇటీవల సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ నాయకులు స్పందించి, మంగళవారం ధర్మారంలోని అంబేదర్ విగ్రహం సాక్షిగా చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఈ మేరకు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పూస్కూరు రామారావు, పాకాల రాజయ్య, ఆవుల శ్రీనివాస్, ఆవుల వేణు, మహిళా నాయకురాలు ఆవుల లత, గుజ్జేటి కనకలక్ష్మీ, మార సంధ్య, దేవి రేణుక కాంపల్లి అపర్ణ తదితరుల ఆధ్వర్యంలో పార్టీ నాయకుడు రామారావు ఇంటి నుంచి ర్యాలీగా అంబేదర్ చౌరస్తాకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న సీఐ ప్రవీ ణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ర్యాలీగా వెళ్తున్న పలువురు ముఖ్య నాయకులను అడ్డుకున్నారు.
అయినప్పటికీ పెద్ద సంఖ్యలో గులాబీ శ్రేణులు అంబేదర్ చౌరస్తాకు చేరుకున్నారు. కరీంనగర్ -రాయప ట్నం రహదారిపై రాస్తారోకో చేసే ప్రయత్నం చేయగా, ఎస్ఐ లక్ష్మణ్‌తో పాటు పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు. కాగా, సీఐ మాత్రం మిగతా ముఖ్య నాయకులను కేడీసీసీ బ్యాం కు వద్ద నిలిపివేసి, అంబేదర్ చౌరస్తాకు వెళ్లవద్దని సర్దిచెప్పారు. సీఐ మాట ప్రకారం, పార్టీ ముఖ్య నాయకుల పిలుపు మేరకు అంబేదర్ రస్తాలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులందరూ కేడీసీసీ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించడానికి సిద్ధమవుతున్న క్రమంలో వారిని చూసిన కాంగ్రెస్ నాయకులు అంబేదర్ చౌరస్తా నుంచి మూకుమ్మడిగా దూసుకువచ్చారు. అభివృద్ధిపై చర్చించే ప్రక్రియను పక న పెట్టి, బీఆర్ఎస్ నాయకులపై దౌర్జన్యం చేసేందుకు యత్నించారు. ఘర్షణ వాతావరణాన్ని సృష్టించారు. సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులను అదుపు చేసే ప్రయత్నం చేశా రు. మరోవైపు రోప్‌తో కాంగ్రెస్ నాయకులను కట్టడి చేసేందుకు ప్రయత్నించినా కానీ పోలీసులను నెట్టుకుంటూనే వారు ముందుకు రాసాగారు. దీంతో కరీంనగర్-రాయపట్నం రహదారిపై గంటసేపు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం పోలీసు అధికారులు ఇరు వర్గాలను శాంతింపజేశారు. బీఆర్ఎస్ నాయకుల ను పాత బస్టాండ్ వైపు, కాంగ్రెస్ నాయకుల ను అంబేదర్ చౌరస్తా వైపునకు మళ్లించారు.
మండలంలో అభివృద్ధిపై చర్చకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆరోపించారు. కాంగ్రెస్ నా యకుల దౌర్జన్యానికి నిరసనగా రోడ్డుపై ఆందోళన చేస్తున్న సమయంలో ఒక నాయకుడు అకస్మాత్తుగా దూసుకువచ్చి తనతో పాటు మేడారం గ్రామ పార్టీ నేత దేవి రమణపై స్వల్పంగా దాడి చేశాడని, అతని నుంచి చాకచక్యంగా తప్పించుకున్నట్లు తెలిపారు. ఘటనను పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. కాంగ్రెస్ శ్రేణుల దౌర్జన్యాలకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మారం మండలంలో పదేండ్లలో చేసిన అభివృద్ధిపై చర్చించే దమ్ము లేక తమపై ఆ పార్టీ నాయకులు దాడి చేసినట్లు మండిపడ్డారు. తమ సవాళ్లను స్వీకరించే, ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా దౌర్జన్య పూరితంగా వ్యవహరించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.