VeenaVanka | వీణవంక, మే 1 : వీణవంక మండలంలోని చల్లూరు, వీణవంక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతూ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో తైక్వాండో పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన విద్యార్థులను చల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఈఓ ఎస్. శోభారాణి, తహసీల్దార్ దాసరి రాజమల్లు, ఎస్సై ఆవుల తిరుపతి అభినందించారు.
వారికి షీల్డ్లు, మెమోంటోలు అందజేసి, అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభకనబరిచి, ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మధుసూదనాచారి, కోచ్ బావు సంపత్, పీఈటీ రజిని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.