Dharmaram | ధర్మారం, జూన్ 6 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు 2025-26 గాను జాతీయ ఆర్థిక ప్రతిభ ఉపకార వేతనం (ఎన్ఎంఎంఎస్ )పథకం కింద ఎంపిక కాగా వారిని శనివారం పాఠశాలలో ఉపాధ్యాయులు అభినందించారు. గత ఏడాది పాఠశాలలో ఎనిమిదో తరగతి చదివిన విద్యార్థులు అజ్మీర ఘన సాయినాయక్, లావుడియా శశాంక్ నాయక్ ఈ ఉపకార వేతనాలకు ఎంపికయ్యారు.
ఈ విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రతి సంవత్సరం రూ.12వేలు చొప్పున ప్రతిభ పురస్కారం అందుతుంది. ఇట్టి జాతీయ ప్రతిభ పురస్కారానికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల హెచ్ఎం పోతు ప్రభాకర్ తో పాటు సర్పంచ్ గొల్ల కృష్ణ, ఉప సర్పంచ్ మొట్టె తిరుపతి, ఏఏపీసీ చైర్మన్ ఇటికాల భాగ్యలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.