Godavarikhani | కోల్ సిటీ, డిసెంబర్ 28 : గోదావరిఖని హనుమాన్ నగర్ కు చెందిన రేడియం శ్రీనివాస్ తనయుడు రవి సుమన్ ఇటీవల పాండిచ్చేరిలోని సెంట్రల్ యూనివర్సిటీలో మాస్ మీడియా అండ్ కమ్యూనికేషన్లో చేరాడు. కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన స్వచ్ఛభారత్ షార్ట్ ఫిలీం కాంటెస్ట్ లో పాల్గొని ప్రతిభతో తీసిన లఘు చిత్రానికి అవార్డు లభించింది. ఆ అవార్డును పాండిచ్చేరి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ సందర్భంగా స్థానిక మార్కండేయ కాలనీలో తెలంగాణ షార్ట్ ఫిలీం ప్రొడ్యూసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు.
పాండిచ్చేరి ముఖ్యమంత్రి చేతుల మీద ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకొని గోదావరిఖని కి మరింత గౌరవం తీసుకవచ్చాడని పేర్కొన్నారు. అలాగే స్థానిక కళాకారులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచాడని కొనియాడారు. పుర ప్రముఖులు, కళాకారులు, ప్రొడ్యూసర్లు పాల్గొని రవి సుమన్ ను అభినందనలతో ముంచెత్తారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత ల మండలి పెద్దపల్లి శాఖ అధ్యక్షుడు కొమ్మ కుమార్ యాదవ్, కళాతోరణం ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ అశోక్ వేముల, సీనియర్ కళాకారులు దామెర శంకర్, దయానంద్ గాంధీ, కార్మిక నాయకులు సీహెచ్ ఉపేందర్, డైరెక్టర్లు గొట్టే మహేష్, నగునూరి విజయ్, సంపత్ ఊదరి, బీఎన్ క్రియేషన్ అధినేత బడికిల గణేష్, కళాకారిణి జక్కని శ్రీలత, మేకల శ్రీకాంత్, డాక్టర్ జేవీ రాజు సీనియర్ కళాకారులు వాసు, కుమార్, లక్ష్మణ్, అంజన్న, దామెర రాజేష్, రేడియం శ్రీనివాస్, శంకర్, ఉపాధ్యాయులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.