social responsibility | పెద్దపల్లి, జూన్21: జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడం.. సామాజిక బాధ్యతని అదనపు డీఆర్డీవో రవీందర్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం సెర్ఫ్ డీపీఎం, ఏపీఎం, సీసీ, మెప్మా సిబ్బందికి ఉల్లాస్ యాప్ పై శిక్షణ కార్యక్రామాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు అందరు కృషి చేయాలన్నారు.
స్వశక్తి సంఘ మహిళలను ముందుగా అక్షరాస్యులని చేయటానికి 90 శాతం సర్వే అయిందని, మరో రెండు మూడు రోజుల్లో సర్వే పూర్తి చేసి ఉల్లాస్ యాప్‌లో ఎంట్రీ చేయాలన్నారు. 10 మంది నిరక్షరాస్యులకు ఒక చదువుకున్న మహిళ వాలంటీర్‌గా ముందుకు వచ్చి నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కోరారు. చదవటం, రాయటం వచ్చిన మహిళలను, ఓపెన్ స్కూల్ విధానంలో 10వ తరగతి , ఇంటర్ పరీక్షలు రాయటానికి ఆడ్మిషన్లు చేయించాలన్నారు.
18 సంవత్సరాల లోపున్న దివ్యాంగుల పిల్లల వివరాలు సేకరించి భవిత కేంద్రాలకు అనుసంధానం చేసి వారికి ఫిజియోథెరపి, స్పీచ్ థెరఫి లాంటి సేవలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడల్ట్ ఎడ్యుకేషన్ ఏపీవో శ్రీనివాస్, జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి హన్మంతు, జీసీడీవో కవిత, సెర్ఫ్ డీపీఎం కే రవి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.