Complete information | పెద్దపల్లి, ఆగస్టు30: వచ్చే నెల 7లోగా వివిధ శాఖల సంపూర్ణ సమాచారం అందించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశింంచారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఎంఎఫ్టీ బేస్ లైన్ సర్వేపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శనివారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీఎంఎఫ్టీ బేస్ లైన్ సర్వేలో భాగంగా విద్యాశాఖ, ప్రణాళిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మిషన్ భగీరథ ఇంట్రా, గ్రిడ్, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా ఆసుపత్రి, వ్యవసాయ శాఖ, హౌసింగ్, పశు సంవర్ధక శాఖ పరిధిలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ అంశాలతో కూడిన సంపూర్ణ సమాచారం వివరాలను సెప్టెంబర్ 7లోపు అందించి బుక్ లెట్ తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ గంగాధర శ్రీనివాస్, డీడబ్ల్యూవో వేణుగోపాల్, హౌసింగ్ పీడీ రాజేశ్వర్ రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రోడ్లకిరువైపులా 40వేల మొక్కలను నాటాలి
జిల్లాలోని రోడ్లకు ఇరు వైపులా వారం రోజుల్లో 40వేల ఎత్తైన మొక్కలు నాటి గ్రీనరీ పెంచాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వన మహోత్సవం కార్యక్రమంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. వన మహోత్సవ కార్యక్రమం కింద జిల్లాలో గ్రీనరీ పెంచేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.
మొక్కల సంరక్షణ కోసం సహాయ కర్ర, టీ గార్డ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్లో మొక్కలకు రెగ్యులర్గా నీటి సరఫరా జరిగేలా చూడాలని, మొక్కలు ఎండి పోతే వెంటనే రిప్లేస్ చేయాలన్నారు. మొక్కల సంరక్షణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ నరేందర్, జిల్లా అటవీ అధికారి శివయ్య, డీఆర్డీవో ఎం.కాళిందిని, డీపీవో వీర బుచ్చయ్య, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.