చిగురుమామిడి, జూన్ 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరి కోసం ఎంతో మంది అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్నారని, గ్రామాల్లో అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామసభలో ఎంపిక జరగాల్సినప్పటికీ జరగకుండా అధికారులు, అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు ఎంపిక చేశారన్నారు. అర్హులైన వారికి ఇండ్ల మంజూరు చేయడం లేదని ఎంతో మంది అరులైన వారు గ్రామాల్లో ఇల్లు లేక కిరాయిలకు జీవిస్తున్నారని, అర్హులైన వారికి అన్యాయం జరిగిందని సిపిఐ మండల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు గురువారం వినతి పత్రం అందజేశారు.
నిరుద్యోగ యువతీ యువకుల ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రవేశపెట్టిన రాజీవ్ వికాస పథకం కు ఎంతోమంది దరఖాస్తు చేసుకున్నారని, గ్రామసభల్లో ఎంపిక చేయకుండా ఎంపీడీవో కార్యాలయంలో అర్ధరాత్రి ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఎంపీడీవో పై అనేక అనుమానాలు ఉన్నాయని, ఎంపీడీవో కార్యాలయంలో అర్ధరాత్రి వరకు అధికార పార్టీ నాయకులను కూర్చోబెట్టుకొని ఎంపిక చేయడం జరిగిందన్నారు.
మండలంలో లబ్ధిదారులు ఎంపికలో ఎంపీడీవో వైఖరి పై సమగ్రమైన విచారణ జరిపి అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మరియు రాజు యువ వికాసం పథకం మంజూరు చేసి అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు పేర్కొన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందే స్వామి, మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, మండల సహాయ కార్యదర్శి బూడిద సదాశివ తదితరులున్నారు.