కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 31 : నగరంలో చేపడుతున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు. శనివారం నగరంలోని 13, 29 డివిజన్లలో చేపడుతున్న వివిధ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
13 డివిజన్లో చేపట్టే 10 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో వడ్డెర కమ్యూనిటీ హాల్, హస్నాపూర్ కమ్యూనిటీ హాల్ పనులు, 29వ డివిజన్లో ఎంపీ లాడ్స్ నిధుల నుంచి 15 లక్షలతో చేపట్టే కమ్యూనిటీ హాల్ నిర్మాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
అందరికీ అందుబాటులో ఉండే విధంగా కమ్యూనిటీ హాళ్లను నిర్మాణం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.