Chigurumamidi | చిగురుమామిడి, నవంబర్ 17: దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్న మతతత్వ పార్టీలను తరిమికొట్టాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రచార జాత చిగురుమామిడి మండల కేంద్రంను చేరుకోగా, చాడ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ సంపదను ప్రధానమంత్రి మోడీ, ఆదాని, అంబానీలకు అప్పగిస్తున్నారని అన్నారు. ఒకవైపు దేశంలో నిత్యవసర వస్తువులు ధరలు పెంచుతూ సామాన్య ప్రజలకు పెనుబారం మోపుతున్నారని అన్నారు.
ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. నియోజకవర్గంలో సాగు తాగునీరు కోసం కమ్యూనిస్టు పార్టీ వరద కాలువ కోసం విశేషంగా కృషి చేసిందన్నారు. కమ్యూనిస్టులు చేసిన త్యాగాలు మరో లేనివన్నారు. మతతత్వ బిజెపిని నిర్మూలించేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. సిపిఐ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా జోడేఘాట్ నుండి భద్రాచలం వరకు ప్రచార జాత నిర్వహిస్తుందన్నారు. డిసెంబర్ 26న చలో ఖమ్మం భారీ బహిరంగ సభను నిర్వహించి ప్రజల్లో చైతన్యవంతం తీసుకు వస్తామన్నారు. కాగా ప్రచార జాతకు సిపిఐ మండల శాఖ ఆధ్వర్యంలో డప్పు చప్పులతో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ ప్రచార జాతలో రాష్ట్ర నాయకులు తక్కలపల్లి శ్రీనివాసరావు కొండవీటి శంకర్ మారుపాక అనిల్ కుమార్ మణికంఠ రెడ్డి,అందే స్వామి, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా నాయకులు బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కొయ్యడ సృజన్ కుమార్ చాడ శ్రీధర్ రెడ్డి, ఎలగందుల రాజయ్య, బూడిద సదాశివ, ముద్రకోల రాజయ్య,తేరాల సత్యనారాయణ, బోయిని పటేల్, తమ్మిశెట్టి రవీందర్, విలాసాగరం అంజయ్య, పరకాల కొండయ్య, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, అందే చిన్న స్వామి, కూన లెనిన్, నీల వెంకన్న వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.