ప్రజల భద్రతకు కమాండ్ కంట్రోల్ సిస్టమ్
నగరంలో ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం స్మార్ట్‌సిటీలో భాగంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ వై సునీల్ రావు తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో మంగళవారం ఆయన మున్సిపల్ కమిషనర్ సేవా
త్వరలో ఏర్పాటు చేసేందుకు చర్యలు
మేయర్ వై సునీల్‌రావు
కార్పొరేషన్, మార్చి 29: నగరంలో ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం స్మార్ట్‌సిటీలో భాగంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ వై సునీల్ రావు తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో మంగళవారం ఆయన మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, స్మార్ట్‌సిటీ అధికారులు, వివిధ కన్సల్టెన్సీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పనితీరును పలు సంస్థల ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం నగరపాలక సంస్థలో తాతాలికంగా ఏర్పాటు చేసిన డెమోను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ వై సునీల్‌రావు మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ను ప్రజెంటేషన్ చేసిన సంస్థల పనితీరును పరిశీలించి, ప్రాజెక్ట్ ఏర్పాటు పనులను ఏజెన్సీకి అప్పగిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను 5 నుంచి 6 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
సీసీ సర్వైవ్‌లెన్స్, ట్రాఫిక్ సిగ్నలింగ్ కోసం గతంలో పోలీస్ శాఖ, నగరపాలక సంస్థ ద్వారా గుర్తించిన లొకేషన్స్‌ను సంబంధిత ఏజెన్సీకి అప్పగించి, ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ ప్రాజెక్ట్‌లో ప్రధానంగా అధిక నిఘా సామర్థ్యం ఉన్న కెమెరాలను ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు సిగ్నిలింగ్ సిస్టమ్ ద్వారా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. అలాగే, వాహనదారులు ట్రాఫిక్, ఆర్టీఏ నిబంధనలు పాటించేలా అత్యాధునిక టెక్నాలజీ సిస్టమ్‌ను ఇందులో పొందుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. వాహనాలు ఎంత వేగంతో ఉన్నా నంబర్ గుర్తించే కెమెరాలు, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారికి అటోమెటిక్ ఫైన్, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించే టెక్నాలజీ లాంటివి కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌లో ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. వివిధ ప్రకటనల కోసం నగరంలో 10 ఎల్ఈడీ సీన్లు, 40 చోట్ల అనౌన్స్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
పారిశుధ్యం మెరుగులో భాగంగా ఇందులోనే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో చెత్త వాహనాల జీపీఎస్ ట్రాకింగ్ విధానం కూడా అమర్చుతామని తెలిపారు. తద్వారా నగరంలో ఎకడ వాహనాలు తిరుగుతున్నయి, చెత్తను ఎకడ సేకరిస్తున్నారనే సమాచారం తెలిసే విధంగా టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి పోలీస్, నగరపాలక సంస్థ అనుసంధానంలో పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంబంధిత ఏజెన్సీ మూడేళ్ల పాటు వాటి నిర్వహణ బాధ్యతలు చేపడుతుందని పేర్కొన్నారు. బల్దియా ఎస్ఈ నాగమల్లేశ్వర్ రావు, స్మార్ట్ సిటీ అధికారి కళ్యాణ్, వివిధ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

