Color Therapy | సారంగాపూర్, జూలై 30 : మండలంలోని ఆర్పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో కలర్స్ థెరపీ పరిచయ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రీస్కూల్ కార్యక్రమంలో భాగంగా కలర్స్ థెరపీ పరిచయ కార్యక్రమంలో ఎల్లో రంగు కలర్ పిల్లలకు గుర్తుండే విధంగా కలర్స్ థెరఫీ పరిచయం కోసం పిల్లలు, టీచర్లు అందరూ ఎల్లో రంగు దుస్తులను ధరించుకుని ఎల్లో రంగులో ఉన్న పండ్లు, కూరగాయాలు, వివిధ రకాల ఎల్లో రంగు వస్తువులతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం సెక్టార్ సమావేశం నిర్వహించి సీజనల్ వ్యాదులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంగన్వాడి కేంద్రాల నిర్వహణ, పౌష్టికాహారం, విద్య, కిచెన్ గార్డెన్స్ నిర్వహణ, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో వాణిశ్రీ, మాజీ వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్, ఆంగన్వాడి సూపర్ వైజర్ లత, అంగన్వాడి. టీచర్లు, ఆయాలు, తలుల్లు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.