కరీంనగర్ కమాన్ చౌరస్తా, మే 11 : ఎప్‌సెట్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం కరీంనగర్‌లోని వావిలాలపల్లిలోగల కళాశాల ప్రాంగణంలో ఆయన విద్యార్థులను అభినందించి మాట్లాడారు. తమ విద్యా సంస్థల్లోని విద్యార్థులు 405, 430, 560, 697, 730, 760, 791, 859, 934,1104, 1166, 1546, 1619, 1795, 1950 ర్యాంకులతో పాటు మొత్తం 89 మందికి పైగా విద్యార్థులు 10 వేలలోపు ర్యాంకులు సాధించారని చెప్పారు. ట్రినిటీ జూనియర్ కళాశాలలు పోటీ పరీక్షల్లో ఏటా అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తూ విద్యా రంగంలో తమ ప్రత్యేకతను చాటుతున్నాయని తెలిపారు.
ఐఐటీ జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్, ఎప్‌సెట్ పోటీ పరీక్షల బోధనలో అనుభవం, నైపుణ్యం కలిగిన అధ్యాపకుల శిక్షణ, అంకిత భావం కలిగి, నిరంతరం కృషి చేయడం ద్వారానే ఈ ర్యాంకులు సాధ్యమయ్యాయన్నారు. ఈ ఫలితాలు కేవలం కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన కళాశాలల్లోవి మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి విద్యార్థులను అభినందిస్తూ, ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అధ్యాపకులను అభినందించారు.
కరీంనగర్ కమాన్‌చౌరస్తా, మే 11 : ఎప్‌సెట్ -2025 ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లోని వావిలాలపల్లిలోగల టైనిటాట్స్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. కళాశాలకు చెందిన బీ వర్షిత్ 203, అదిబా ఫిర్థోజ్ 206, ఎం ప్రణీత్ 250, కే మనోజ్‌కుమార్ 286, బీ శ్రీనిత్య 296,
జీ కౌషల్ ప్రియ 339, జీ రిషిత 438, జే అనూష 447, కే అర్చన 485, ఎండీ అబ్దుల్ జిషాన్ 551, సీహెచ్ శ్రీనిధి 567, కే వీరేంద్రప్రసాద్ 572, ఎం రోహిత్‌రెడ్డి 606, అబు ఉమేర్ 614, హాస్నమహవిష్ 639, పీ శ్రీనిత్యరెడ్డి 704, కే శ్రీరామ్‌చరణ్ 732, కే హాసిని 735, రాంసకోరిన్ 738, డీ సుమగ్జయ 752, ఎల్ శరణ్య 762, జీ సింధు 763, బీ అభిజ్ఞ 801, జే వామిక 807, వీ అక్షయ్ 831, డీ హరిశంకర్ 838, బీ భువనకృతి 839, ఏ శశిప్రితమ్ 853, కే సాయిశ్రేయాన్రెడ్డి 908, వీ హృషికేశ్ 920, మహ్మద్ సప్రోజ్ 927, కే గాయత్రి 992, ఏ శ్రీనిజరెడ్డి 997 వ ర్యాంకు సాధించారన్నారు.
వెయ్యిలోపు 33 మంది, 2000 వరకు 72 మంది, 3000లోపు 105 మంది, 5000లోపు 192 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించి అల్ఫోర్ కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటారని చెప్పారు. తకువ మంది విద్యార్థులతో అత్యధిక అత్యద్భుత ర్యాంకులు సాధించడం అల్ఫోర్స్‌కు మాత్రమే సాధ్యమని ఈ ఫలితాలు తెలియజేశాయన్నారు. ఇదే క్రమంలో ఇటీవల ప్రకటించిన ఐఐటీ ఫలితాల్లో ప్రతిభ కనబర్చి 461 మంది అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారన్నారు. రానున్న అడ్వాన్స్డ్ ఫలితాల్లోనూ తమ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, నీట్ ఫలితాల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తారని చెప్పారు.
కమాన్‌చౌరస్తా, మే 11: ఎప్‌సెట్ ఫలితాల్లో శ్రీచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభచూపినట్లు విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాశాల ప్రాంగణంలో విద్యార్థులను ఆయన అభినందించారు.
గోకులకొండ వైష్ణవి 810 ర్యాంకు, బీ మనోఘ్న 968, బీ సాత్విక్ 1142, పీ స్ఫూర్తిశ్రీ 1527, బీ శ్రావణి 1803, పీ బ్లెసీ సుసన్ 2106, పీ చందన 2165, పీ భరత్ రెడ్డి 2815, పీ అజితేష్ 3016, కే అనూహ్య 3503, వీ ప్రవీణ్ 3623, డీ రిషి 3996, జీ అర్చన 4171, ఆర్ శ్రీయాన్ 4246, వీ శివాణి 4570, బీ స్రవంతి 4957 ఇలా 16 మంది 5 వేలలోపు ర్యాంకులు సాధించారని, 10 వేల లోపు 51 మంది విద్యార్థులు సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు.
ఈ విజయ సాధనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడిన అధ్యాపకులను అభినందించారు. ఇక్కడ శ్రీ చైతన్య కళాశాలల డైరెక్టర్ కర్ర సరేందర్ రెడ్డి, దీన్ జగన్ మోహన్ రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఏజీఎం శ్రీనివాస్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.