జగిత్యాల, ఆగస్టు 20 : జిల్లాలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నందున ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తూ, అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ బీ సత్యప్రసాద్ వర్షాకాల వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో న మోదైన డెంగ్యూ కేసులు, తీసుకున్న చర్యలు, వ్యాధి మూ లాలు, నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో జ్వర సర్వే, టెస్టులు అధికంగా చేయడం ద్వారా తొందరగా డెంగ్యూ కేసులను గు ర్తించి చికిత్సతోపాటు వ్యాధి వ్యాప్తిని కొంత వరకు అరికట్ట గలమని తెలిపారు. చికున్ గున్యా కేసులు కూడా నమోదవుతున్నందున, జ్వరంతో బాధపడుతున్న వారికి డెంగ్యూ, చి కున్ గున్యా, మలేరియా పరీక్షలు చేయాలని ఆదేశించారు. ప్రజల్లో దోమల నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ చైతన్య పరిచాలని, వైద్యాధికారులు క్షేత్ర పర్యటనలు చేయాలని సూ చించారు. మెట్పల్లి పట్టణంలో జ్వర కేసులు ఎకువ నమోదయ్యాయని, అందుకు కారణాన్ని కనుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గౌతంరెడ్డి, డీపీవో రఘువరన్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డా సమీయుద్దీన్, ప్రోగ్రాం అధికారులు డాక్డర్ శ్రీనివాస్, ఏ శ్రీనివాస్, ఎపిడెమాలజిస్ట్ వంశీ, సీహెచ్‌వో శ్రీధర్, అసిస్టంట్ మలేరియా అధికారి సత్యనారాయణ, విస్తరణాధికారి శ్రీధర్, ఆరోగ్య బోధకులు భూమేశ్వర్, శంకర్ సిబ్బంది పాల్గొన్నారు.
మంజూరైన డబుల్ బెడ్రూం ఇండ్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. మంగళవారం జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో 2018 నూకపల్లి గృహాలపై కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, జగిత్యాల పట్టణానికి మంజూరైన 4,520 డబుల్ బెడ్రూం ఇండ్లను ఎంపిక చేసి అలాట్ చేశారన్నారు. మిగిలిన గృహాలను ఎంపిక చేసేందుకు మీ సేవ ద్వారా అప్లికేషన్లు స్వీకరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో మధుసూదన్, మిషన్ భగీరథ అధికారులు, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.
డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండి ఇబ్బంది కలుగకుం డా వైద్య సేవలందించాలని కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో డాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జీజీహెచ్, ఎంసీహెచ్‌లో మొత్తం ఎంత మంది డాక్టర్లున్నారు, డిప్యుటేషన్‌పై ఎంత మంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు సెలవులో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలో ఉన్న ప్రొఫెసర్లను వారికి బదులుగా ఎలా కేటాయిస్తారంటూ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే దవాఖానలో డాక్టర్లు లేకుండా నర్సులు ఎలా ట్రీట్మెంట్ ఇస్తారని అడిగారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సెలవులో వెళ్లిన డాక్టర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. లీవ్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం దవాఖానకు కావాల్సిన సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. డెలివరీ అయిన బాలింతలను వార్డుకు తీసుకువెళ్లాలంటే ర్యాంపు మాత్రమే ఉందని లిఫ్ట్ లేదని దానివల్ల ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎండీ సమీయొద్దీన్, వైద్యాధికారులు, వైద్యులు పాల్గొన్నారు.