జగిత్యాల, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : వచ్చే నెల మూడో తేదీ నుంచి ఐదో తేదీ వరకు నిర్వహించే పల్స్ పోలియోను విజయవంతం చేయాలని అధికారులను జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా ఆదేశించారు. ఐదేండ్లలోపు ప్రతి చిన్నారికీ రెండు చుకల పోలియో మందును వేయడంపై విసృ్తత ప్రచారం చేయాలని సూచించారు. పోలియో మహామ్మారిని పారదోలేందుకు ప్రతి ఒక్క రూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మార్చి 3న బూత్ స్థాయిలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు చుక్కల మందు వేయాలని, 4, 5 తేదీల్లో ఇంటింటికీ తిరిగి చిన్నారులకు చుకల మందు పంపిణీ చేయాలన్నారు. రెండు రోజుల ముందు నుంచే గ్రామాల్లో టాం-టాం ద్వారా విసృ్తత ప్రచారం చేయాలని సూచించారు. ప్రయాణ సమయంలో ఉన్న చిన్నారులకు ఆయా బస్స్టేషన్లలో ఏర్పాటు చేసిన పోలి యో చుకల బూత్‌లలో పోలియో చుకలు వేసే విధంగా ఏర్పాట్లు చేపట్టాలని జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి ఆర్టీసి డిపో మేనేజర్లను ఆదేశించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ స్వచ్ఛంద సంస్థలు సహకారం అందిచాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ దివాకర, డీఎంహెచ్‌వో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.