Collector Satya Prasad | కొడిమ్యాల, జూన్ 24 : కొడిమ్యాల మండల కేంద్రంలో జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ను సందర్శించారు. మోడల్ స్కూల్ లో చెత్త ఉండటం పై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెత్తను తొలగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో అక్షరాలను బోర్డు పై రాయించారు. మోడల్ స్కూల్లోనే కాకుండా కొడిమ్యాలలోని పలు కాలనీలను సందర్శించి చెత్త ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీఓ స్వరూప, తదితరులు పాల్గొన్నారు.