కలెక్టరేట్, జూన్ 24: ప్రజా సమస్యలను సత్వరమే పరిషరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కల్టెరేట్లోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఖీమ్యానాయక్తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థా యిలో పరిశీలించి, వెంటనే పరిషరించాలని సూచించారు. కాగా, ప్రజావాణికి మొత్తం 202 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.