సిరిసిల్ల్ల రూరల్, నవంబర్ 6: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, రైతులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్, ఎన్హెచ్ఎం డైరెక్టర్, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించా రు. బుధవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వి స్తృతంగా పర్యటించారు. సమగ్ర కుటుంబ సర్వే తీరును పరిశీలించారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల, నేరెళ్ల, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్నబోనాల, పెద్ద బోనాల, ముష్టిపల్లిలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌తో కలిసి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.
అలాగే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్‌లో కలెక్టర్ పమేలా సత్పతి, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూ రు, మల్యాల మండలం రామన్నపేటలో కలెక్టర్ బీ సత్యప్రసాద్‌తో కలిసి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రాల్లో ధాన్యం కుప్పలు, తేమశాతం, కాంటా వేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
కేంద్రాల నుంచి తరలించి ధాన్యం బస్తాలపై సెంటర్ పేరు సరిగ్గా కనిపించేలా ముద్ర వేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణకు ముందుకువచ్చే రైస్‌మిల్లర్లకు కేటాయించాలని సూచించారు. ఎవరూ ముందుకురాకపోతే ప్రత్యామ్నాయంగా ఉన్న గోదాములకు తరలించాలని ఆదేశించారు. రైతులకు ఎకడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే పత్తి పండించిన రైతులు తమ పరిధిలోని కేంద్రాలకు పంట ఉత్పత్తులను తరలించాలని సూచించారు. ఇకడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధాభాయ్, తంగళ్లపల్లి తహసీల్దార్ జయంత్‌కుమార్, మెప్మా డీఎంసీ రాజేశం, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు.