కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 26: గణతంత్ర వేడుకలు ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఉదయం విద్యార్థుల ర్యాలీలు, ప్రదర్శనలు, జయజయ నినాదాల నడుమ ఊరూరా సంబురాలు హోరెత్తాయి.. అనంతరం అంతటా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి.. కరీంనగర్, జగిత్యాల పోలీస్ పరేడ్ మైదానాలు, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి కలెక్టరేట్లలో కలెక్టర్లు పమేలా సత్పతి, సత్యప్రసాద్, సందీప్‌కుమార్ ఝా, కోయ శ్రీహర్ష జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల్లో సేవలందించిన అధికారులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఆయా కలెక్టరేట్లలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కరీంనగర్లో కలెక్టర్‌తోపాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో పాటు సీపీ అభిషేక్ మొహంతి స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సన్మానించారు. అనంతరం పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్ళను సందర్శించారు. కరీంనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించగా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పాల్గొన్నారు. జగిత్యాలలో జరిగిన వేడుకల్లో విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, ఎస్పీ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
పెద్దపల్లిలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్‌సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని మహాత్మాగాంధీ స్టేడియంలో జరిగిన వేడుకలకు సీజీఎం చందన్‌కుమార్ సమంత, రామగుండం కమిషనరేట్‌లో సీపీ శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిరిసిల్లలో జరిగిన వేడుకల్లో విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ చంద్రయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, అదనపు కలెక్టర్ ఖిమ్యానాయక్ పాల్గొన్నారు.
పోలీసుల నుంచిగౌరవ వందనం స్వీకరిస్తున్న రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్
జగిత్యాల: జెండా వందనం చేస్తున్న కలెక్టర్ సత్యప్రసాద్, అధికారులు
కరీంనగర్: ఎమ్మెల్యే క్యాంపు కార్యాయలంలో జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్
పెద్దపల్లి: మహిళా పోలీస్ బెటాలియన్ నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్ కోయ శ్రీహర్ష