కలెక్టరేట్, ఫిబ్రవరి 13 : సంతానం లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవటమే శ్రేయస్కరమని, కలెక్టర్ పమేలా సత్పతి(Collector Pamela Satpathy) అన్నారు. నగరంలోని శిశుగృహ నుంచి ఐదుగురు మగ శిశువులు, నలుగురు ఆడ శిశువులను వివిధ జిల్లాలకు చెందిన పిల్లలు లేని దంపతులకు గురువారం దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ సమావేశమందిరంలో వారికి దత్తత ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..దత్తత ఇచ్చిన పిల్లలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.
చట్టబద్ధమైన దత్తత కోసం నగరంలోని బాల రక్ష భవన్లో గల జిల్లా సంక్షేమాధికారిని సంప్రదించాలని సూచించారు. వరంగల్, సిద్ధిపేట, నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి, నల్లగొండ జిల్లాలకు చెందిన దంపతులు శిశువులను దత్తత తీసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి కర్ర సబిత, డిసిపివో పర్వీన్, సిడబ్ల్యుసి చైర్పర్సన్ ధనలక్ష్మి, పివో తిరుపతి, శిశుగృహ మేనేజర్ తేజస్వి, సోషల్ వర్కర్ రాజేశ్, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.