కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అంగన్వాడీ చిన్నారులతో మమేకమయ్యారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలోని రెండు అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభ కార్యక్రమానికి హాజరైన ఆమె, ఇలా చిన్నారులతోపాటు నేలపై కూర్చొని వారిలో కలిసిపోయారు.
పిల్లలతో కొద్దిసేపు ఆనందంగా గడిపారు. వారితో కథలు చెప్పించుకుని, పాటలు పాడిస్తూ, నృత్యం చేయించారు. విశాల్ అనే బాలుడు తన తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్లగా.. నానమ్మ దగ్గర ఉంటున్నానని చెప్పడంతో దగ్గరకు తీసుకుని బాగా చదువుకోవాలని ఆప్యాయంగా మాట్లాడారు.
– తిమ్మాపూర్, ఆగస్టు 2