Dharmaram | ధర్మారం, జనవరి 10 : రానున్న స్థానిక మండల పరిషత్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే ప్రధాన ధ్యేయంగా సత్తా చాటడానికి పార్టీ శ్రేణుల సమిష్టి కృషి చేస్తానని పెద్దపల్లి జిల్లా ధర్మారం బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాంబాబును ధర్మారం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా నియమించిన విషయం తెలిసిందే. కాగా ధర్మారం మండల కేంద్రం లోని ఆర్బీఎస్ జిల్లా మాజీ సభ్యుడు రామారావు స్వగృహంలో ఆయనను పార్టీ నాయకులు ఆదివారం సన్మానించారు.
ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనను పార్టీ పట్టణ అధ్యక్షుడిగా రెండో సారి నియమించినందుకు పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, సహకరించిన పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్, ఇతర పార్టీ నాయకులకు అయన కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి ఈశ్వర్ ఆదేశానుసార నడుచుకొని స్థానిక కమిటీ పార్టీ మాజీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తల సహకారంతో ధర్మారంలో పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని ఆయన పేర్కొన్నారు.
గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి ఈశ్వర్ చేసిన అభివృద్ధి పనులను వివరించి రాబోయే మండల పరిషత్ ఎన్నికల్లో ప్రజలను ఓట్ల అడిగి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. స్థానిక ఎంపీటీసీ రెండు స్థానాల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం సమిష్టిగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. మాజీ మంత్రి ఈశ్వర్ ఆదేశాల మేరకు త్వరలో పార్టీ పట్టణ కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంల పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ఏఎంసీ మాజీ చైర్మన్లు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి, ధర్మారం మాజీ సర్పంచ్ పూస్కురు జితేందర్ రావు, ఆర్బీఎస్ జిల్లా మాజీ సభ్యుడు పూస్కురు రామారావు, మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, నంది మేడారం మాజీ ఎంపీటీసీ మిట్ట తిరుపతి, ధర్మారం మాజీ ఉప సర్పంచ్ ఆవుల లత, పార్టీ సోషల్ మీడియా మండలాధ్యక్షుడు దేవి నళినికాంత్, పార్టీ మండల ఉపాధ్యక్షులు గాజుల రాజు, నాడెం శ్రీనివాస్, వార్డు సభ్యుడు నార ప్రేమ్ సాగర్, మహిళ నాయకురాళ్లు కాంపల్లి అపర్ణ, రేగుల లక్ష్మి, పార్టీ నాయకులు పాక వెంకటేశం, సల్వాజీ మాధవరావు, అర్ధవెల్లి రాము, రాగుల మల్లేశం, ఎండీ షరీఫ్, అయిత వెంకటస్వామి, గోగు దేవేందర్, కాంపల్లి చందు, బోయిని మల్లేశం తదితరులు పాల్గొన్నారు.