గొల్లపల్లి, డిసెంబర్ 4 : ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ గొల్లపల్లి అధ్యక్షుడు పడాల జలంధర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు జలంధర్ ఆధ్వర్యంలో గొల్లపల్లి ఆర్యవైశ్య సంఘ భవనంలో ఆదివారం పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని న్విహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జగిత్యాల జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. భారీ బహిరంగ సభకు గొల్లపల్లి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేసేలా చూడాలని నాయకులకు సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొల్లం రమేశ్, ఏఎంసీ వైస్ చైర్మన్ కనుకుట్ల లింగారెడ్డి, ఉప సర్పంచ్ రాజశేఖర్, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ లింగారెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కిష్టారెడ్డి, మారెట్ కమిటీ డైరెక్టర్లు వెంకటరమణ, నాయకులు వెంకటేశ్, రమేశ్, కొమురయ్య, సతీశ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
కొడిమ్యాల, డిసెంబర్ 4 : ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కేంద్రానికి ఈ నెల 7న రానున్న సందర్భంగా మండలం నుంచి వేలాదిగా టీఆర్ఎస్ శ్రేణులు తరలిరావాలని సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు పిలుపునిచ్చారు. హిమ్మత్‌రావుపేటలో ఆదివారం టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులి వెంకటేశంగౌడ్ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 24 గ్రామాల నుంచి 7 వేల మందిని తరలించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదేశించినట్లు చెప్పారు. 24 గ్రామాలకు 24 బస్సులు, 24 వ్యాను, 50 టాటా మ్యాజిక్‌లు,100 ఆటోలు, 200 కార్లను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కలెక్టరేట్ భవనంతో పాటు , టీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభం, వైద్య కళాశాల భవనానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించనునట్లు చెప్పారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు మేన్నేని రాజనర్సింగరావు, పోలు రాజేందర్, బండ రవీందర్‌రెడ్డి, రైతు బంధు సమతి మండల కన్వీనర్ అంకం రాజేశం, లింగాగౌడ్, కొత్తూరి స్వామి, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామాధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.