నల్లసూర్యులకు రాష్ట్ర సర్కారు మరో కానుక అందించింది. భూగర్భంలో పగలనకా.. రాత్రనకా పనిచేసి సంస్థను ప్రగతి పథంలో నడిపిస్తున్న కార్మికుల శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. ఆది నుంచీ సింగరేణి పుత్రుల సంక్షేమానికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్, మరోసారి తన ప్రేమను చాటారు. అసెంబ్లీ వేదికగా దసరా, దీపావళి బొనాంజాగా రూ.వెయ్యి కోట్లు ప్రకటించి చరిత్ర సృష్టించారు. ఆ మొత్తాన్ని పండుగలకు ముందుగానే చెల్లిస్తామని పేర్కొనగా, ఒక్కో కార్మికుడికి రూ.1.50లక్షల నుంచి రూ.2లక్షల దాకా వచ్చే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగా, 11వ వేజ్‌బోర్డు 23 నెలల ఏరియర్స్ మరో రూ.వెయ్యి కోట్లు వచ్చే నెలలో చెల్లించబోతుండగా, కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
గోదావరిఖని, ఆగస్టు 7: ఆది నుంచీ సింగరేణిపై ప్రత్యేక అభిమానం చూపుతున్న సీఎం కేసీఆర్, మ రోసారి తన ప్రేమను చాటారు. 2023-24 సంవత్సరానికిగాను సంస్థ సాధించిన లాభాల్లో వాటా, దీపావళి బోనస్ కింద కార్మికులకు రూ.వెయ్యి కోట్లు ఇస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించగా, కార్మికులు సంబురపడుతున్నారు.
లాభాల్లో వాటా రూ.700 కోట్లు..
సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.2222 కోట్ల లాభాలు సాధించింది. ఇందులో కార్మికులకు వాటాగా రూ.700 కోట్లు దసరా పండుగకు ముందుగానే చెల్లిస్తామని సీఎం కేసీఆర్ గత నెల మంచిర్యాల పర్యటనలో స్పష్టం చేశారు. తాజాగా కార్మికులకు దసరా, దీపావళి పండుగలకు ముందుగానే మొత్తం రూ.1000 కోట్లు చెల్లిస్తామని ఆదివారం అసెంబ్లీలో పేర్కొనడంతో హర్షం వ్యక్తమవుతున్నది. కార్మికులకు గతేడాది లాభాలపై 30శాతం వాటాను చెల్లించారు. ఈ సారి అంతే మొత్తం అయితే కేవలం రూ.666.6 కోట్లు మాత్రమే వస్తాయి. అంటే ఈ సారి కేసీఆర్ మరో ఒకటి లేదా రెండు శాతం వాటాను పెంచి రూ.700 కోట్లను చెల్లిస్తామని చెప్పారు. అంతే ఒక్కో కార్మికుడికి రూ.లక్షకు పైనే వాటా సొమ్ము అందనున్నది. దీనికి తోడు ఏటా కోల్ఇండియాలో దసరాకు ముందుగా, సింగరేణిలో దీపావళి పండు గ సందర్భంగా చెల్లించే బోనస్‌ను ఈ సారి కోల్ఇండియాలో ఎంత డిక్లేర్ అయితే అంతే మొత్తంలో సింగరేణిలో చెల్లించాలని సీఎం ఆదేశించారు. గతం కంటే బోనస్ పెరిగే అవకాశాలతో ఈ సారి రూ. 300 కోట్ల దాకా బోనస్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రతి కార్మికుడికి రూ.70వేలకు పైగా వచ్చే అవకాశాలున్నాయి. ఈ లెక్కన లాభాల్లో వాటా, దీ పావళి బోనస్ కింద కార్మికులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.1.50 లక్షల నుంచి రూ.2లక్షల దాకా అందే అవకాశాలున్నాయి.
మరో వెయ్యికోట్ల ఏరియర్స్..
బొగ్గు గని కార్మికులకు 11వ వేతన ఒప్పందానికి సంబంధించి చెల్లించాల్సిన 23నెలల ఏరియర్స్‌ను కోల్ఇండియా యాజమాన్యం సెప్టెంబర్‌లో చెల్లిస్తోన్న క్రమంలో సింగరేణిలోనూ అదే టైంలో చెల్లించేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకు సం బంధించి మరో వారంలో సర్క్యూలర్ వచ్చే అవకాశం ఉంది. 1-7-2021 నుంచి అమలు కావాల్సిన 11వ వేతన ఒప్పందం 23నెలలు ఆలస్యంగా పరిష్కారం కావడంతో ఆ బకాయి డబ్బు లు సింగరేణి యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. 23 నెలల ఏరియర్స్ రూపంలో ఒక్కో కార్మికుడికి రూ.లక్షన్నర నుంచి రూ.5లక్షల దాకా వచ్చే అవకాశముంది. సింగరేణిలో కొత్తగా ఉద్యోగంలో చేరిన కార్మికులకు నెలకు రూ.10వేల దాకా కలుగుతుండడం, సీనియ ర్ కార్మికులకు రూ.30వేల దాకా నెలకు పెరుగుదల ఉండడంతో కార్మికులకు భారీగానే చెల్లింపులు ఉం టాయని పేర్కొంటున్నారు.
సింగరేణి యాజమా న్యం ఇప్పటికే వేతనాల పెరుగుదలకు సంబంధించిన మొత్తాన్ని మినహాయించి పక్కనబెట్టిన క్రమంలో ఆ చెల్లింపులు చేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు. ఏది ఏమైనా వచ్చే మూడు నెలలు సింగరేణి కార్మికులకు భారీగా బొనాంజాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌లో ఏరియర్స్ రూ. వెయ్యి కోట్లు, అక్టోబర్‌లో దసరా పండుగకు ముందుగానే లా భాల్లో వాటాగా రూ.700 కోట్లు, నవంబర్‌లో దీపావళి పండుగకు ముందుగానే లాభాల బోనస్ మరో రూ.300 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనికి తోడుగా సింగరేణిలో ఏటా అనవాయితీగా వస్తోన్న దసరా అడ్వాన్స్‌ను పండుగకు ముందుగానే రూ.25వేలు చెల్లిస్తున్నారు. దీనికి గాను రూ.100 కోట్ల దాకా చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ఒక్కో కార్మికుడిఈ మొత్తాలు కార్మికులకు లభించనున్నాయి.
సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు..
ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గును వెలికితీస్తు న్న సింగరేణి కార్మికుల కష్టానికి తగ్గ ప్రోత్సా హం ఇస్తున్న ఏకైక సీఎంగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంస్థను ఒకవైపు అభివృద్ధి పథంలో నడిపిస్తూనే, మరోవైపు కార్మికులకు వాటి ఫలాలను పంచుతున్నారు. ఈ క్రమంలోనే సింగరేణి గతేడాది సాధించిన లాభాల్లో కార్మికులకు రూ. 700 కోట్ల వాటాను ప్రకటించారు. అంటే ఈ సారి 31శాతం వాటా అందుతుంది. దీపావళీ ముందు ఇచ్చే బోనస్‌ను రూ.300 కోట్లు చెల్లించనున్నారు. దీనికి తోడు కోల్ఇండియాలో ఇప ్పటికే నిర్ణయమైన 11వ వేజ్‌బోర్డు ఏరియర్స్ రూ.వెయ్యి కోట్లను సెప్టెంబర్‌లో చెల్లించాలని సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశాం.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి