కాంగ్రెస్‌ను నమ్మితే..కైలాసం ఆటల పెద్దపాము మింగినట్లే
కాంగ్రెస్ కాలంలో పేరుకే కాలువలు తప్ప ఎన్నడూ నీళ్లు కండ్ల చూడలె.. పేరుకుపోయిన చెట్లు.. మరమ్మతులేని గేట్లు చూసి గోస పడ్డం.. ఆనాడు మూసీ ప్రాజెక్టును నాశనం చేసిందే కాంగ్రెస్..’ అంటూ ముఖ్యమంత్రికే. చంద్రశేఖర్ రావు మండిపడ్డారు.
- పేరుకే కాలువలు..నీళ్లెన్నడూ కండ్ల చూడలె
- కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నీటి పన్ను
- తెలంగాణలో నీటి తీరువా రద్దు
- వెన్నవరం, పెన్‌పహాడ్ కాల్వల్లో నీళ్లు
- ఫ్లోరైడ్ నీళ్లు తాగించింది కాంగ్రెస్ కాదా ?
- బీజేపీకి ఓటేస్తే మోరీల పారేసినట్లే
- ఆగమాగం కావొద్దు.. ఆలోచించి ఓటేయాలె
- బీఆర్ఎస్ అభ్యర్థులను నిండు మనసుతో దీవించాలె
- ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు
డోర్నకల్ ;‘కాంగ్రెస్ కాలంలో పేరుకే కాలువలు తప్ప ఎన్నడూ నీళ్లు కండ్ల చూడలె.. పేరుకుపోయిన చెట్లు.. మరమ్మతులేని గేట్లు చూసి గోస పడ్డం.. ఆనాడు మూసీ ప్రాజెక్టును నాశనం చేసిందే కాంగ్రెస్..’ అంటూ ముఖ్యమంత్రికే. చంద్రశేఖర్ రావు మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, సూర్యాపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థులు, ఎమ్మెల్యే రెడ్యానాయక్, మంత్రి జగదీశ్‌రెడ్డిలకు మద్దతుగా జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నీటి పన్ను ఉన్నదని, తెలంగాణలో నీటి తీరువాను, పాత బకాయిలను రద్దు చేసినట్లు చెప్పారు. బీఆర్ఎస్ పాలనలోనే కాలువల్లోకి నీళ్లు వచ్చాయని, వెన్నవరం, పెన్‌పహాడ్ కాలువల్లో బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయన్నారు. మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీళ్లు తాగించిన పాపం కాంగ్రెస్‌దేనని అన్నారు. కాంగ్రెస్‌ను నమ్మితే కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లేనని అన్నారు. ఇక తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటూ వేయొద్దన్నారు. బీజేపీకి ఓటేస్తే మోరీల పారేసినట్లేనని అన్నారు. యుద్ధం చేసేటోని చేతిలోనే కత్తి ఉండాలని, పంట పొలాల్లో నీళ్లు పారాలంటే.. బీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యే రెడ్యానాయక్, మంత్రి జగదీశ్రెడ్డిలను నిండు మనసుతో దీవించాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

