Civil Rights Day | కాల్వ శ్రీరాంపూర్ ఫిబ్రవరి 28 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారంలో శనివారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. సర్పంచ్ రేకుల జ్యోతి రఘు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు మాట్లాడారు. కులమతాలకు అతీతంగా అందరం సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని సూచించారు. ఎక్కడా కూడా అంటరానితనం అసమానతలు లేకుండా మానవులంతా ఒక్కటే అనే విధంగా ముందుకు వెళ్తామని చెప్పారు.
గ్రామంలో ఎలాంటి కులవివక్ష అనే మాటలు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మేడి అశోక్ గౌడ్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి షాబుద్దీన్, వీపీఓ ఎండీ అన్వర్, హెల్త్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి వార్డు సభ్యులు మిర్యాల మల్లేష్, చిక్కుల వంశీ ఆశా వర్కర్లు సుమ, శైలజ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.