బోయినపల్లి, డిసెంబర్ 4: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రాని కి చెందిన మామిండ్ల రవి అనారోగ్యంతో గత సెప్టెంబర్‌లో చనిపోగా, ఆయన భార్య రమాదేవికి ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబీమా ప్రొసీడిం గ్ పత్రాన్ని ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో నారుమడికి కూడా సాగునీరు లేక రైతులు నానాఅవస్థలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది ఎకరాలు బీళ్లుగా ఉండడంతో రైతులు వలసవెళ్లి రోజువారీ కూలీలుగా పని చేశారన్నారు.
స్వరాష్ట్రం లో ప్రాజెక్టులన్నీ పూర్తి కావడంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందుతున్నదని తెలిపారు. ప్రజ లు, రైతులకు తాగు, సాగునీటికి ఢోకాలేదని చెప్పా రు. సీఎం కేసీఆర్ రైతుల అభ్యున్నతి కోసమే పెట్టుబడి సాయం అందిస్తున్నారని తెలిపారు. రైతులు ఏ కారణంతో అయినా చనిపోతే రైతుబీమా ద్వారా రూ.5లక్షలు అందిస్తున్నారని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు.
ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టంచేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ లెంకల సత్యనారాయణరెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కొనుకటి లచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ కొనుకటి నాగ య్య, టీ(బీ)ఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు కొట్టెపల్లి సుధాకర్, కొండగట్టు ఆలయ కమిటీ సభ్యుడు ముద్దం రవి, ఏవో ప్రణీత, సర్పంచులు చిందం రమేశ్, ఇల్లందుల శంకర్, వంగపల్లి సత్యనారాయణరెడ్డి, కన్నం మధు, బూర్గుల నంద య్య, ఎంపీటీసీలు సంబ బుచ్చమ్మ, ఉపేందర్, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ అజ్జు, ఏఎంసీ డైరెక్టర్లు పోలె కొమురయ్య, బాపురెడ్డి, సాగర్ ఉన్నారు.