siricilla chitra bar | సిరిసిల్ల టౌన్, మార్చి 2: సిరిసిల్లలో గత రెండు నెలల క్రితం కక్ష సాధింపు చర్యలో భాగంగా సీజ్ చేసిన చిత్రబార్ ఎట్టకేలకు తెరుచుకుంది. హైకోర్టు ఆదేశాలతో మున్సిపల్ అధికారులు బుధవారం బార్ సీల్ ను తొలగించారు. మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య బార్ ఫీజు తొలగిస్తున్న సమయంలో అక్కడే ఉన్న మీడియా కమిషనర్ ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా హైకోర్టు పరిధిలో ఉన్నదని, ఏమీ మాట్లాడలేమని దాటవేశారు. రెండు నెలల క్రితం ఆదేశాలు వస్తే ఇప్పటివరకు ఎందుకు తీయలేదని అడగగా హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు సీల్ ఓపెన్ చేసినట్లు కమిషనర్ చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయారు.
అక్కడే ఉన్న భారీ యజమాన్యం తమకు అన్యాయం జరిగిందంటూ కమిషనర్ తో వాపోయారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించినప్పటికీ కావాలనే తమకు అన్యాయం చేశారని వాపోయారు. ఇదిలా ఉండగా రెండు నెలల క్రితం ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించలేదంటూ అప్పటి మున్సిపల్ కమిషనర్ లావణ్య సిరిసిల్ల పట్టణం బీఆర్ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి కి సంబంధించిన చిత్రబార్ ను సీజ్ చేశారు.
మరో నెల రోజులపాటు ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించేందుకు గడువు ఉన్నదని చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదు. అప్పటికప్పుడు కమిషనర్ సూచన మేరకు ఆన్లైన్లో ట్రేడ్ లైన్స్ ఫీజులు పూర్తిగా చెల్లించారు. అయినప్పటికీ అధికారులు సీజ్ తొలగించలేదు. దీంతో భారీ యజమాని హైకోర్టును ఆశ్రయించారు. జనవరి 31న వారు సీజన్ తొలగించాలంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లు బార్ యజమాన్యం తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు వచ్చినప్పటికీ స్థానిక అధికారులు పట్టించుకోకుండా రెండు నెలలపాటు సీజ్ తొలగించలేదని ఆరోపించారు. తమపై కక్ష సాధింపులు చర్యలకు పాల్పడినా చివరకు న్యాయమే గెలిచిందంటూ పేర్కొన్నారు.